ప్రధాని నరేంద్ర మోడీని అభిమానించే వారికి.. ఆరాధించే వారికి కొదవ ఉండదు. ఆయన తన మాటలతో.. చేతలతో ఎంతలా మనసుదోచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నింటికి మించి మోడీ మాష్టారిలో ఇద్దరు తరచూ కనిపిస్తుంటారు. అందులో ఒకరు అసలుసిసలు రాజకీయ నేత కాగా.. మరొకరు వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఎప్పుడు ఏ పాత్ర డామినేట్ చేస్తుందన్నది అప్పటి అవసరానికి అనుగుణంగా ఉంటుంది.
ఓవైపు విలువల గురించి నాన్ స్టాప్ గా స్పీచులు ఇచ్చే ప్రధానమంత్రి.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తన చేతిలో ఉన్న అధికారం తన చేతిలోనే ఉండిపోవాలన్నట్లుగా ఆయన నిర్ణయాలు ఉంటాయన్నది మర్చిపోకూడదు.
తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి మరోసారి వార్తాంశంగా మారారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. దేశ ప్రధానిగా వ్యవహరిస్తూనే 50 కిలోమీటర్ల భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. దేశ ప్రధాని కుర్చీలో కూర్చొని.. ఇంతలా కష్టపడటం.. శ్రమించటంఇప్పటివరకు ఎవరిలోనూ కనిపించటం లేదని చెబుతున్నారు.
దేశంలోనే అతి పెద్ద రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలో 50కిలోమీటర్ల మేర ఆయన యాత్ర సాగింది. ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఇలాంటి ఫీట్ సాధించటం ఆయనకే చెల్లుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంత హడావుడిలోనూ.. తాను పయనిస్తున్న మార్గంలో ఒక అంబులెన్సు రాగా.. క్షణాల మీద స్పందించిన ప్రధాని మోడీ.. తన వాహనాన్ని పక్కకు ఆపించి.. సదరు అంబులెన్సు వెళ్లేలా దారి కల్పించటం పలువురి మనసుల్ని దోచేసింది. ఇలా దోచే కార్యక్రమాల్ని విజయవంతంగా ప్రదర్శించే ఆయన తీరుకు నిదర్శనమన్నట్లుగా ఒక వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. మోడీనా? మజాకానా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View
Full View Full View Full View Full View Full View Full View