ముడి వేయటం సులువు. కానీ.. దాన్ని తీసేటప్పటికే తల ప్రాణం తోకకు వస్తుంది. పడిన ముడిని విడదీసే బదులు పీటముడి వేస్తేనే ఇబ్బంది. సరిగ్గా అదే పని చేసిన ప్రధాని మోడీ.. గడిచిన కొంతకాలంగా కిందా మీదా పడుతున్నారు. ఏ ముహుర్తంలో రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారో కానీ.. ఏదో ఒక ఇబ్బంది ఆయన్ను వెంటాడి వేధిస్తోంది. దశాబ్దాల తరబడి నలుగుతున్న కశ్మీర్ ఇష్యూను సిం‘ఫుల్’ గా తేల్చేసినట్లుగా ప్రచారం జరిగినా.. లోతుగా చూస్తే.. కాంగ్రెస్ వేసిన ముడికి.. మోడీ పీటముడి వేశారే కానీ.. ముడిని తీయలేదన్న విషయం కాస్త ఆలస్యంగా అర్థమైంది.
అదృష్టం ఏమంటే.. ఏడాదిన్నరగా కొవిడ్ పుణ్యమా అని.. మోడీ వైఫల్యాలు పెద్దగా బయటకు రాలేదు. ఎంత కవర్ చేసినా కవర్ కాని కొన్నింటితో ఇప్పటికే ఆయన ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యిందన్న విశ్లేషణలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. జమ్ముకశ్మీర్ లో రాజకీయ వ్యవస్థను పునరుద్దరించేందుకు వీలుగా కశ్మీరీ పార్టీలు.. వాటి అధినేతల్ని ప్రధాని మోడీ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
కశ్మీర్ కు రాష్ట్ర హోదాను మళ్లీ పునరుద్దరించే అంశం మీద చర్చించటానికి పిలుస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని.. కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్వర్గీకరణపై చర్చించటానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అయితే.. ఈ విషయాన్ని పలువురు అనుమానిస్తున్నారు. కారణం లేకపోలేదు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న నాటి నుంచి తాను తీసుకునే కీలక నిర్ణయాల సమాచారాన్ని ఎవరితో పంచుకోవటానికి కానీ.. విపక్షంతో భేటీ కావటం.. అఖిలపక్ష్ సమావేశాన్ని నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకోవటం కానీ చేయరన్న సంగతి తెలిసిందే.
అలాంటిది.. కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన మీద ఇంత హడావుడి చేస్తారా? అన్నది ప్రశ్న. అయితే.. ప్రధాని ఆహ్వానించిన సమావేశానికి కశ్మీర్లో మాంచి పట్టు ఉన్న ఫరూక్ అబ్దుల్లా కానీ పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ హాజరవుతారా? లేదా? అన్నది సందేహంగా మారింది. కశ్మీర్ వరకు పెద్ద తలకాయలుగా పేరున్న వీరిద్దరు కానీ ప్రధాని మోడీతో జరిగే భేటీకి హాజరు కాకుంటే.. ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్న చర్చ బలంగా సాగింది.
నిజానికి ఈ విషయంలో మోడీషాలు కూడా కూసింత టెన్షన్ లోనే ఉన్నట్లు చెబుతారు. అందరి సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఫరూక్.. మొహబూబాలు ఇద్దరూ హాజరవుతారని వెల్లడించి.. హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేశారని చెప్పాలి. అయితే.. ఈ సమావేశంలో కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి.. రాష్ట్ర హోదా కూడా ఇవ్వాలన్న తమ డిమాండ్ ను సమావేశంలో ప్రస్తావిస్తామని ముఫ్తీ వెల్లడించారు. 2019 ఆగస్టులో 370 అధికరణాన్ని రద్దు చేసిన దరిమిలా.. కశ్మీర్ లోని రాజకీయ పార్టీలన్ని కలిసి గుప్ కార్ అలయెన్స్ గా ఏర్పడటం.. బీజేపీ వేరుగా ఉండటం తెలిసిందే. గత డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుప్ కార్ అలయెన్స్ 100 సీట్లు గెలుచుకుంటే.. బీజేపీ 74 సీట్లలో గెలిచింది. దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.