ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న సీఎంల సమావేశం ప్రారంభం సమయంలో ఆసక్తికరమైన చిత్రం చోటు చేసుకుంది. దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరైన సందర్భంగా వారితో మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ క్రమంలో ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పలకరించారు. అనంతరం పలువురు సీఎంలకు నమస్కరించి ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు.
ఈ సమావేశం సందర్భంగా వచ్చిన మోడీ వ్యతిరేక సీఎంలుగా పేరుపడ్డ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ - ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లతో ఒకింత ఎక్కువ సమయం మోడీ మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించిన మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ఒకింత ఎక్కవ సమయం గడిపారు. అనంతరం బాబును విష్ చేసి తర్వాత సీఎం వద్దకు వెళ్లారు.