సందేహం వస్తే చాలు వెంటనే చేతి వేళ్లు వెళ్లేది గూగులమ్మ మీదకే. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక పని మీద గూగులమ్మను టచ్ చేయకుండా పొద్దు పొడవని పరిస్థితి. అంతలా జీవితాల్లో భాగమైన గూగులమ్మలో ఏడాది వ్యవధిలో అత్యధికంగా ఏయే విషయాల మీద వెతికారు? అన్నది చూస్తే.. జనాలు ఏ విషయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
ఈ ఏడాదిలో మొబైల్ లో గూగులమ్మలో వెతికిన టాప్ 10 విషయాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2019లో భారతీయులు అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన అంశాల్ని చూస్తే..
1. 2019 వరల్డ్ కప్
2. లోక్‌సభ ఎన్నికలు
3. చంద్రయాన్ 2 ప్రయోగం
4. కబీర్ సింగ్ మూవీ
5. అవేంజర్స్ ఎండ్ గేమ్ (సినిమా)
6. జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు
7. నీట్ పరీక్ష
8. జోకర్ (సినిమా)
9. కెప్టెన్ మార్వెల్ మూవీ
10. పీఎం కిసాన్ యోజన
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే లోక్ సభ ఎన్నికల కంటే కూడా వరల్డ్ కప్ మీదనే ఎక్కువ మంది ఆసక్తిని ప్రదర్శించటం ఒక ఎత్తు అయితే.. దేశ భవితపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైన ఆర్టికల్ 370 నిర్వీర్యం అంశం కంటే కూడా కబీర్ సింగ్ మూవీ గురించి వెతికిన వారే ఎక్కువగా ఉండటం విశేషం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. శతాబ్దానికిపైగా పెండింగ్ లో ఉండి.. సుదీర్ఘకాలంగా సాగిన అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంశం టాప్ టెన్ లో లేకపోవటం గమనార్హం. మొత్తం పది అంశాల్లో మూడు.. సినిమాలకు సంబంధించే ఉండటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.
అందులో రెండు విదేశీ సినిమాలు అయితే.. ఒకటి మాత్రం బాలీవుడ్ రీమేక్ మూవీ కబీర్ సింగ్. తాజాగా విడుదలైన ఈ ఫలితాల్ని చూస్తే.. మొబైల్ ఇంటర్నెట్ వినియోగించే వారి ప్రాధాన్యతా అంశాలు ఎలా ఉంటాయన్నది దీన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.