మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న విజయసాయిరెడ్డి!

Update: 2020-04-08 09:30 GMT
కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ..ఆ తరువాత అంచలంచెలుగా ఒక్కో దేశానికీ విస్తరించి ..ప్రస్తుతం ప్రపంచం మొత్తం విస్తరించింది. ఈ కరోనా వైరస్ వెలుగులోకి నెలలు గడుస్తున్నా కూడా దీనికి సరైన వ్యాక్సిన్ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న ఏకైక మార్గం సామాజిక దూరం...అదే లాక్ డౌన్. ఈ నిర్ణయాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చాలా ముందు చూపుతో అలోచించి తీసుకున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం  కరోనా దెబ్బకి  అల్లాడిపోతున్న నేపథ్యంలో 130 కోట్ల పై చిలుకు ప్రజలు ఉన్న ఈ సువిశాలమైన భారతదేశంలో కరోనా కొద్దిగైనా కంట్రోల్ లో ఉండటానికి కారణం ప్రధాని మోదీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం.

ప్రధాని హోదా లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని .. ఇప్పుడు ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. అలాగే భారత్ బాటలో ఇప్పుడు ఎన్నో దేశాలు నడుస్తున్నాయి. మోదీ ..చెప్పిన లాక్ డౌన్  గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. కానీ , దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతుంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ సమయంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే ..దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టించడం ఖాయం అని పలువురు నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని పార్లమెంటరీ పార్టీ నాయకులతో  ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం నుండి వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ప్రధాని తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ భేటీలో లాక్ డౌన్ పొడగింపు పై  - అలాగే కరోనా వివిధ రాష్ట్రాలలో ఎలా ఉంది - అలాగే కరోనా ను అరికట్టాలంటే ఇంకా ఇలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై  సుదీర్ఘంగా చర్చినట్టు తెలుస్తుంది.
Tags:    

Similar News