తన స్టాండప్ కామెడీలో హిందూ దేవతల్ని కించపరిచేలా చేస్తాడన్న ఆరోపణలున్న మునావర్ ఫారుఖీ ఎట్టకేలకు తాను అనుకున్నది పూర్తి చేశాడు. దేశంలోని వివిధ నగరాల్లో తన షోను నిర్వహించాలన్న అతడి కల సాధ్యం కాకున్నా.. ఆ మధ్యన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి మరీ హైదరాబాద్ కు స్వాగతం పలికిన వైనం తెలిసిందే. కేటీఆర్ వెలకం చెప్పిన 'షో' కు ఎన్ని ఆటంకాలు ఏర్పడినా సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యిందంటే అందులో ప్రభుత్వం నుంచి అందిన సాయం అంతా ఇంతా కాదని చెబుతున్నారు.
మునావర్ షోను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేయటంలో పోలీసులు కీలక భూమిక పోషించారని చెబుతున్నారు. పక్కా ప్లాన్ తోనే ఇదంతా జరిగినట్లుగా చెబుతున్నారు. అసలు జరుగుతుందా? లేదా? అన్న సందేహాల్ని కొనసాగేలా చేయటం.. ఓపక్క 'షో'ను మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నట్లు చెప్పి.. టికెట్లను అమ్ముతున్నా.. వేదికను బుక్ చేసుకున్న మునావర్ ప్రోగ్రాం సంస్థ.. శిల్పకళావేదికకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా చెల్లించలేదన్న ప్రచారం కూడా వ్యూహంలో భాగంగా చెబుతున్నారు.
టికెట్ల అమ్మకం వేళ ఈ షో మూడు గంటల పాటు సాగనున్నట్లు చెప్పినప్పటికీ.. రన్నింగ్ టైం వచ్చేసరికి మాత్రం కేవలం 1.45 గంటలు మాత్రమేనని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం గంట ముందే మొదలైందని.. అనుకున్న దాని కంటే మరో గంటబావు ముందే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. దీనికితోడు షో నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకుతావు లేకుండా ఉండేందుకు కనీసం మంచినీళ్ల బాటిల్ ను సైతం అనుమతించకపోవటం.. సెల్ ఫోన్లకు కూడా నో చెప్పటం కూడా సరైన నిర్ణయమని చెబుతున్నారు. లోపల ప్రోగ్రాం ఎలా జరిగింది? ఏం జరిగింది? అన్న దానికి సంబంధించిన వివరాలు ఎవరూ రికార్డు చేసే అవకాశం లేకపోవటంలో.. తప్పుడు సమచారాన్ని ప్రచారం చేసే అవకాశం లేకుండా చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ షోను తాము భగ్నం చేస్తామని బీజేపీతో పాటు పలు హిందూ సంస్థలు చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ లేకుండా చేయటంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. సాయంత్రం 5 గంటల నుంచే షో కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారిని వేదిక లోపలకు పక్కాగా తనిఖీలు నిర్వహించి మరీ పంపటం.. ఆరు గంటలకుమొదలైన షో 8 గంటలకు కాస్త ముందే పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. 'షో'ను భగ్నం చేసేందుకు బీజేపీ.. బీజేవైం కార్యకర్తలు విడతల వారీగా శిల్పకళావేధిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయటం.. అలా వచ్చిన వారిని వచ్చినట్లుగా లిప్టు చేసేసి గచ్చిబౌలి స్టేషన్ కు దాదాపు 60 మంది వరకు తరలించినట్లుగాచెబుతున్నారు. షో పూర్తి అయిన తర్వాత వారిని వదిలేసినట్లుగా తెలుస్తోంది.
ఈ షో కోసం దాదాపు 2వేలకు పైగా టికెట్లు బుక్ చేసుకోగా.. ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వందలాది పోలీసులు పహరా కాశారు. భద్రత కోసం 2వేల మంది పోలీసుల్ని వినియోగించినట్లుగా ప్రచారం చేయగా.. వాస్తవంలో మాత్రం వెయ్యి మంది కంటే తక్కువనే పోలీసులు ఉన్నారని.. కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేశారన్న మాట వినిపిస్తోంది. మునావర్ షో వేళ తమ కార్యకర్తల్ని కొట్టి మరీ.. ప్రోగ్రాంను పూర్తి చేశారన్న ప్రచారాన్ని బీజేపీ ఇప్పటికే షురూ చేయటం గమనార్హం.