జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎంపీ, సీనియర్ సినీ నటుడు మాగంటి మురళీమోహన్ సరికొత్త స్టైల్లో విమర్శలు చేశారు. ఆయన పవన్ ను తిట్టినట్టు కాకుండా పొగిడినట్టు కాకుండా కామెంట్లు చేశారు. ఆదివారం పవన్ పెనుమాక పర్యటనలో మాట్లాడుతూ 3 వేల ఎకరాల కోసం తాను అనసవరంగా రాద్దాంతం చేస్తున్నానన్న మంత్రి రావెల కిషోర్ బాబుకు గతంలో ల్యాండ్ బ్యాంకర్, టీడీపీ ఎంపీ మురళీమోహన్ కొద్దిపాటి భూమి కోల్పోతేనే సుప్రీంకోర్టుకు వెళ్లలేదా..భూమి కోల్పోయిన బాధ ఒక్క మురళీమోహన్ దేనా...రైతులకు ఉండదా అని ప్రశ్నించి సంగతి తెలిసిందే.
పవన్ వ్యాఖ్యలపై మంగళవారం రాజమండ్రిలో మురళీమోహన్ స్పందించారు. రాజధాని భూముల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది నూటికి నూరుపాళ్లు నిజమే అన్నారు. కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రైతులు భూములు త్యాగం చేయాల్సిందేనని కూడా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ రింగురోడ్డు వద్ద తన సంస్థకు చెందిన భూములపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఔటర్ రింగ్ రోడ్డు కోసం తాను లే అవుట్లుగా వేసిన 18 ఎకరాల భూములను లాక్కున్న మాట నిజమేనని..దీనిపై తాను న్యాయ పోరాటం చేశానని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత వట్టి వసంత్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు మురళీమోహన్ చెప్పారు. తాను రాజధాని అమరావతి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి పర్యటిస్తానని...తనకు అక్కడ అంగుళం భూమి కూడా లేదన్నారు. ఇంతకు మురళీమోహన్ పవన్ తో కలిసి పర్యటిస్తానని చెపుతూనే తన భూముల గురించి ఆయనకు అవగాహన లేదని చెప్పడం గమనార్హం.