పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. దాని స్టేటస్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలంటే కాస్త కష్టతరమైన విషయమే. ఈ విషయంలో ఇకపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన 24 గంటలు గడవకముందే ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ ఐఆర్)ను ఆన్ లైన్ లోకి ఎక్కించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇంటర్నెట్ సౌకర్యం సరిగా విస్తరించని రాష్ట్రాలకు మాత్ర ఈ గడువును 72 గంటలుగా నిర్దేశించింది. ఇలా చేయడం ద్వారా కేసులతో సంబంధమున్న వ్యక్తులు ఆ కాపీని డౌన్ లోడ్ చేసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం కోర్టుల్లో దరఖాస్తు చేసుకోగలరు అని కోర్టు పేర్కొంది.
ఏ రాష్ట్రంలోనైనా పోలీసు శాఖకు ప్రత్యేక వెబ్ సైట్ లేనిపక్షంలో.. ఆ రాష్ట్ర అధికారిక వెబ్ సైట్ ను వాడుకోని ఈ మేరకు ఆ వెబ్ సైట్ లోనే వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించిం. జస్టిస్ దీపక్ మిశ్రా - జస్టిస్ సి.నాగప్పన్ లతో కూడిన ధర్మాససం ఈ మేరకు ఈ విషయాలు వెల్లడించింది. ఉగ్రవాదులు - తిరుగుబాట్లు - మహిళలు - పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద నమోదైన కేసులకు సంబందించిన ఎఫ్ ఐఆర్ ను మాత్రం ఆన్ లైన్ లో పెట్టాల్సిన పనిలేదని మినహాయింపును ఇచ్చారు.
ఏ ఎఫ్‌ఐఆర్‌ను వెబ్ సైట్లో ఉంచాలో, ఉంచకూడదో నిర్ణయించాలంటే పోలీసు అధికారికి కనీసం డీఎస్పీ స్థాయి హోదా ఉండాలి. ఎఫ్‌ఐఆర్‌లను వెబ్ సైట్లో ఉంచాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశమంతా అమలు చేయాలని "యూత్ లాయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా" సుప్రీంలో పిటిషన్ వేయగా.. కొన్ని చిన్న చిన్న మార్పులతో కోర్టు అందుకు సమ్మతించింది. నవంబరు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని తన తీర్పులో సుప్రీం ఆదేశించింది.