ప్రజలు కాలంతో పాటే పరుగు పెడుతూ డబ్బు సంపాదన కోసం జీవితాలను త్యాగం చేస్తున్నారు. అయితే డబ్బుతోనే మానసిక శాంతి దక్కుతోందా? భద్రత కచ్ఛితంగా లభిస్తుందా? అంటే .. ససేమిరా అనేస్తున్నాడు ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. అతడు జీవితంలో తాను ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను దాపరికం లేకుండా పంచుకున్నాడు. మైక్ టైసన్ లైగర్ చిత్రంతో భారతీయ సినీపరిశ్రమలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లెజెండరీ ప్రొఫెషనల్ బాక్సర్ మరణం గురించి మాట్లాడారు.
అతడు వీల్ చైర్ లో కనిపించిన తర్వాత.. మరణం నిజంగా త్వరలో రాబోతోందని చెప్పడంతో అది అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. మయామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ గుండా వెళుతున్నప్పుడు మైక్ తన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ వాకింగ్ స్టిక్ తో కనిపించాడు. పూర్తిగా తెల్లని దుస్తులు ధరించి నోటిని తుడుచుకోవడానికి తెల్లటి టవల్ ని ఉపయోగించిన అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపించడం లేదని ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది.. టైసన్ న్యూయార్క్ లో బయటికొస్తున్నప్పుడు వాకింగ్ స్టిక్ తో కూడా కనిపించాడు. అతను తన కారు నుండి తన హోటల్ గదికి వెళ్ళేటప్పుడు సేమ్ (మయామీలో ఉపయోగించినది) అదే వాకింగ్ స్టిక్ తో కనిపించాడు. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు.
అయితే మైక్ గురించి ఊహించుకున్నంతగా ఏదీ తీవ్రంగా లేదు అని మరో సోర్స్ వెల్లడించడం కొంత ఊరట. మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ సయాటికా మంటతో బాధపడుతున్నాడు. ఇది అతని జీవితాన్ని సంక్లిష్టంగా మార్చిన మాట వాస్తవమే అయినా మరీ అంత సీరియస్ కాదు. మైక్ వంటి అథ్లెట్ కు వృత్తిపరమైన ప్రమాదమిదని చెబుతున్నారు. ఇటీవల మైక్ తన స్నేహితుడు - థెరపిస్ట్ సీన్ మెక్ ఫార్ లాండ్ తో సంభాషణ సందర్భంగా మరణం గురించి మాట్లాడాడు. ``మనమందరం ఒక రోజు చనిపోతాము`` అని హాట్ బాక్సిన్ విత్ మైక్ టైసన్ పోడ్ కాస్ట్ సందర్భంగా చెప్పాడు.
చాలా మంది ప్రముఖులు తీవ్ర వేదనతో చనిపోయిన వారిని చూశాను. కానీ నేను వారిలా చనిపోవాలనుకోవడం లేదని కూడా మైక్ టైసన్ తన స్నేహితుడితో అన్నారు. నా గడువు తేదీ దగ్గర పడుతోంది. నిజంగా త్వరలో.. కానీ నేను స్పృహతో చనిపోవాలనుకుంటున్నాను. నాకు అరుస్తూ చనిపోవాలని లేదు. నేను చాలా మంది వ్యక్తుల చివరి కేకలు విన్నాను. ఇంకా చాలా మంది పాపులర్ సెలబ్రిటీలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఈ గ్రహం నుండి అరుస్తూ విడిచి వెళతారు! అని కూడా అన్నాడు.
సంభాషణల సమయంలో మైక్ కూడా తనలో డబ్బు వ్యామోహం కనిపించదని చెప్పాడు. ఎందుకంటే అది భద్రతను తీసుకురాదు. భద్రత అంటే ఏమిటి? వ్యాధులు లేకుండా జీవించడం.. మీరు కారుతో ఢీకొట్టరు.. వంతెనపై నుండి దూకరు కదా?! డబ్బు తమకు సంతోషాన్ని ఇస్తుందని భావించే వ్యక్తులకు నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను! డబ్బుతో ఏదీ రాదని! అని అన్నారు.
డబ్బు రాగానే మనల్ని ఎవరూ ప్రేమించరు. బిలియన్ డాలర్లు ఉన్నప్పుడు ప్రేమను కురిపించరు.. డబ్బుతో భద్రత అనేది తప్పుడు భావం. మీ వద్ద చాలా డబ్బు ఉన్నప్పుడు మీరు అదృశ్యంగా మారతారని నమ్ముతారు.. ఇది నిజం కాదు. అందుకే డబ్బు అనేది ఒక తప్పుడు భద్రత అని నేను ఎప్పుడూ చెబుతుంటానని అన్నారు. మైక్ టైసన్ జీవిత కాలంలో బాక్సింగ్ రింగ్ లో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. అయినా అతడు ఇప్పటికీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. లైగర్ లో అతడి నటన ఎలా ఉందో చూడాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతోంది.