జనసేన ఫోన్లు కూడా ట్యాపవుతున్నాయా ?

Update: 2022-10-24 04:32 GMT
వినటానికే ఇది ఆశ్చర్యంగా ఉంది. జనసేనలో ఎవరి ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తుంది ? అంత అవసరం ఏమొచ్చింది ? పార్టీలో కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతు జనసేన నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందన్నట్లుగా ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగాఉంది. పార్టీపెట్టి ఇప్పటికి తొమ్మిదేళ్ళయినా ఇంతవరకు పార్టీలో పదిమంది నేతల పేర్లు కూడా ఎవరు చెప్పలేరు.

పార్టీ మొత్తంమీద అధినేత  పవన్ కల్యాణ్ తప్ప మరో నేతే కనబడరు. చెప్పుకోవటానికి నాదెండ్లను కీలకనేతగా చెప్పుకోవాలి కానీ ఆయన కెపాసిటి ఏమిటో అందరికీ తెలుసు.

తొమ్మిదేళ్ళ వయస్సున్న పార్టీలో 1-10 వరకు పెద్ద నేతల పేర్లు చెప్పమంటే పవన్ పేరు తప్ప మరో పేరే చెప్పటానికి లేదు. ఏవో నియోజకవర్గాల్లో మీడియా సమావేశాల్లో లేదా ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో కొందరు తమ ఫొటోలను, యాక్టివిటీస్ ను మాత్రం పోస్టులు చేస్తుంటారు.

నాదెండ్ల ఉద్దేశ్యంలో ఇలాంటి వాళ్ళ ఫోన్లను కూడా ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందా ? అసలు జనసేన నేతలుగా చెలామణవుతున్న వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి ప్రభుత్వం ఏమి తెలుసుకోవాలని అనుకుంటుంది ? ఫోన్లను ట్యాపింగ్ చేయించేంత పెద్దపార్టీగా జనసేనను నాదెండ్ల అంచనా వేసుకుంటున్నట్లున్నారు. అంటే తమను తాము చాలా ఎక్కువగా నాదెండ్ల ఊహించుకోవటం వల్ల ఎదురవుతున్న సమస్యిది.

పార్టీ అధినేత పవన్లో  కూడా అచ్చంగా ఇదే సమస్యుంది. తనను తాను చాలా గొప్పవాడిగా ఊహించుకోవటం బాగా అలవాటైపోయింది. జనాలంతా తనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారంటు నోటికొచ్చిందేదో మాట్లాడేస్తుంటారు.

అసలు తనను సీఎంగా చూడాలని కోరుకుంటున్న జనాలెవరు ? అన్నది మాత్రం చెప్పరు. తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను జనాలు ఓడగొట్టిన విషయం తెలిసిందే. ఓటేయాల్సిన నియోజకవర్గాల్లోని జనాలే వేయకుండా ఓడగొడితే ఇక సీఎంగా చూద్దామనుకున్నదెవరు ? మొత్తానికి పవన్ కు తగ్గట్లే నాదెండ్ల కూడా భలే దొరికారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News