రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసుకు సంబంధించి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాననిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హత్యకు ప్రధాన సూత్రధారి అయిన అమృత తండ్రి మారుతీరావు.. ఆయన సోదరుడు శ్రవణ్ లు హైదరాబాద్ వైపు వెళ్లినట్లుగా చెబుతున్నారు.
హత్య జరగటానికి అరగంట ముందు.. వారు మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లినట్లుగా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమృత తండ్రి.. ఆయన సోదరుడ్ని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రణయ్ ను పాశవికంగా హత్య చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడ్ని అదుపులోకి తీసుకుంటే చాలా విషయాలపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సంచలన హత్యోదంతం మీద విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ప్రణయ్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్ ను పరిశీలించారు. ఇందులో.. హత్యకు పాల్పడిన నిందితుడు గత నెల 22న ప్రణయ్ కారును ఫాలో అయినట్లుగా సీసీ కెమేరాలో స్పష్టంగా కనిపించారు.
అంటే.. గత నెల నుంచే ప్రణయ్ కదలికల మీద దృష్టి పెట్టటంతో పాటు.. అతడ్ని అంతం చేయటానికి పక్కా ప్లాన్ వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తన కళ్ల ముందే భర్తను చంపేయటంతో అమృత తీవ్ర షాక్‌కు గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె కండీషన్ కాస్తంత సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గర్భవతి అయిన ఆమె.. ఆర్నెల్ల క్రితమే పెళ్లి అయ్యింది.
మైనర్ గా ఉన్న వేళలోనే వీరిరువురు తమ ప్రేమ గురించి చెప్పటం.. అందుకు పెద్దలు ఒప్పుకోకపోవటంతో దూరంగా ఉన్నారు. ఈ వేళలోనే పోలీసులు కౌన్సెలింగ్ చేసినా వారు తమ ప్రేమను వదులుకోలేదు. ఆర్నెల్ల క్రితం అమృత మేజర్ కావటంతో ఆమెను తీసుకొని ప్రణయ్ హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.
కుమార్తెను తన వద్దకు తీసుకొచ్చేందుకు అమృత తండ్రి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటంతో పాటు.. పలువురు నేతల్ని రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే విదేశాలకు వెళ్లే ప్లాన్ లో ఉన్న వీరిద్దరి ఆశలకు భిన్నంగా అమృత తండ్రి దుర్మార్గం కారణంగా ప్రణయ్ హత్యకు గురయ్యాడు.