మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని 1991లో మానవ బాంబుతో పేల్చి చంపిన ప్రధాన నిందితురాలు నళినీ శ్రీహరన్ ఆనాటి నుండి తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఈమె జైల్లో ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ విషయాన్ని వెంటనే గమనించిన జైలు సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే , ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.
రాజీవ్ హత్యలో దోషిగా నిర్ధారణ అయిన తర్వాత నుంచీ వేలూరు జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న నళిని నిన్న రాత్రి మాత్రం తోటి ఖైదీతో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని జైలు అధికారులు చెబుతున్నారు.రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని గత 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఎప్పుడూ కూడా జైల్లో ఎవరితోనూ గొడవ పడలేదు అని జైలు అధికారులు చెప్తున్నారు. కానీ, అనేకసార్లు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసారు. కానీ , ఆమెకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మాత్రమే మార్చారు.
తాజాగా ఆమె కూతురు పెళ్లి కోసం ఆరు నెలలు పెరోల్ పై బయటికి వెళ్లి తిరిగి వచ్చింది. ఆ తర్వాత తండ్రి శంకర్ నారాయణన్ చనిపోవడంతో అంత్యక్రియల కోసం మరోసారి పెరోల్ పై వెళ్లి వచ్చింది. ఇక రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు