మా మంచి మోడీ కాబట్టి ఇంతలా దయ తలచారు, మా మోడీ సాబ్ కి ఎంత కరుణ రస హృదయమో కదా. ఇది బీజేపీ వారు ఇపుడు చేస్తున్న సరికొత్త్త సంకీర్తన. సరే బీజేపీ వారికి మోడీ దేవుడు. నాయకుడు. సరస్వం ఆయనే. పైగా అది వారి మార్క్ రాజకీయం కూడా. కానీ దేశమంతా ఏమంటోందో కూడా ఇక్కడ చూడాలి.
దేశంలోని విపక్షాలు అన్నీ కూడా మోడీ మార్క్ పెట్రో ట్రిక్స్ అని అభివర్ణిస్తోంది. ఎక్కడో అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ ధరలను తెచ్చి 120 దాకా పెంచేసి ఇపుడు తాపీగా ఏడెనిమిది రూపాయలు తగ్గిస్తే అది దేశ జనాలకు ఉపకారం చేసినట్లా అని కామ్రేడ్స్ సహా అంతా కన్నెర్ర చేస్తున్నారు. గ్యాస్ బండ మీద మూడేళ్ళ కాలంలోనే నాలుగైదు వందల రూపాయలు పెంచేసి ఇపుడు తగ్గించామంటే మెచ్చి చప్పట్లు కొట్టాలా అని కూడా బీజేపీయేతర విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబుకు మాత్రం మోడీ చేసిన పనికి చప్పట్లు కొట్టాలనిపించింది. అందుకే ఆయన మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉపశమనం కలిగించారు అంటూ అచ్చం కాషాయం గొంతుతో పలుకుతున్నారు. పెట్రో డీజిల్ మీద పన్నులు తగ్గించడం అంటే మామూలు విషయం కాదని కూడా అంటున్నారు.
మొత్తానికి బాబు పొగడ్తలలో చాలా విశేషం ఉంది. ఆయనకు ఇది అందివచ్చిన అవకాశం, మోడీకి బీజేపీకి దగ్గర కావాలని ఎదురుచూస్తున్న చంద్రబాబు ఏ మాత్రం లేట్ చేయకుండా మోడీకి జై అనేస్తున్నారు. మోడీ కాబట్టే ఇలా చేయగలిగారు అని కూడా అంటున్నారు.
ఇక ఏపీలో జగన్ మీద కూడా పెట్రో మార్క్ కామెంట్స్ చేస్తున్నారు. పేదలను ఆదుకోవడానికి మోడీ అంతలా దిగివస్తే ఏపీలో మీరేమి చేస్తున్నారు అంటూ నిగ్గదీస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ ఇంకా జనం నడ్డి విరగ్గొట్టేస్తారా అంటూ హూంకరిస్తున్నారు
సరే బాబుకు జగన్ ప్రత్యర్ధి కాబట్టి ఆయన్ని విమర్శించవచ్చు అనుకునన నిజానికి ఇంతలా పెట్రోల్ ధరలు పెంచినది ఎవరు, ఈ రోజుకు సెంచరీలు కొట్టించింది. గ్యాస్ బండను వేయి గడప దాటించింది ఏవరు ఈ సంగతి తెలియదా. అయినా జగనే పెట్రో పాపాలకు మూల కారకుడు అని బాబు తనదైన భాష్యం చెబుతున్నారు.
బాబుకు ప్రతీ విషయంలో మద్దతుగా నిలిచే కామ్రేడ్స్ కూడా మోడీ ఏం ధరలు తగ్గించారు అని గయ్యిమంటూంటే బాబు మాత్రం ఒక వైపే చూస్తున్నారు. జగన్ వైపే తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మొత్తానికి పెట్రోల్ డీజిల్ మీద పన్ను తగ్గింపు కాదు కానీ బాబుకు భలే చాన్స్ దొరికింది అన్న మాట. ఒక చేత్తో మోడీని పొగుడుతూ మరో చేత్తో జగన్ని తెగనాడుతూ తన రాజకీయ పంటను పండించుకుంటున్నారు అని ఎవరైనా అంటే మాత్రం వారిదే తప్పు సుమా. ఎందుకంటే బాబుని అలా అనకూడదు, విజనరీ అని కీర్తించాలి అంతే.