మీరెప్పుడు చూడ‌ని సూర్యుడి చిత్రాలు చూడండి

Update: 2020-07-18 02:30 GMT
విశ్వం మాన‌వ మేధ‌స్సుకు అంతుచిక్క‌ని అంశం. ఎన్నో ర‌హాస్యాలు విశ్వంలో దాగి ఉన్నాయి. ఆ విశ్వంలో ఉండే గ్ర‌హాల‌పై ప‌రిశోధ‌న‌లు పెద్ద సంఖ్య‌లో చేస్తున్నా కొన్ని ర‌హాస్యాలు తెలియ‌డం లేదు. మాన‌వుడు దాదాపు అన్ని గ్ర‌హాల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాడు. కానీ ఒకే గ్ర‌హం సూర్యుడిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి సాహసించ‌డం లేదు. సూర్యుడు ఎప్పుడూ మండుతుండ‌డంతో ఆ గ్ర‌హంపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి సాధ్యం కావ‌డం లేదు. ఎన్నో దేశాలు భగభగమండే సూర్యుడిపై చాలా పరిశోధనలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఒక కొత్త మ‌లుపు తిరిగింది. సూర్యుడికి అతి స‌మీపంలో విజ‌య‌వంతంగా ఆర్బిట‌ర్ తిర‌గ‌డం ఆస‌క్తి రేపుతోంది. ఈ సంద‌ర్భంగా ఆ ఆర్బిట‌ర్ కొన్ని ఫొటోలు భూమికి పంపింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకోండి.

సూర్యుడు భూమికి నుంచి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడికి చేరువ‌లో వెళ్ల‌డం సాహ‌సం.. ఇంతవ‌ర‌కు ఎవ‌రూ ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే ఫిబ్రవరి 9వ తేదీన నాసా ప్ర‌యోగించిన సోలార్ ఆర్బిటర్ అంతరిక్షంలోకి విజ‌య‌వంతంగా వెళ్లింది. అది నాలుగు నెలల తర్వాత సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లింది. ఆ సమయంలో తీసిన చిత్రాలు ఇప్పుడు బయటకు వ‌చ్చాయి. వాటిని నాసా త‌న ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వాటిని చూసిన శాస్త్ర‌వేత్త‌లు అబ్బుర‌ప‌డుతున్నారు.

గ‌తంలో ఎప్పుడూ ఇంత దగ్గర సూర్యుడి చిత్రాలు చూడలేదని చెబుతున్నారు. సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన ఈ చిత్రాలు ఇంతకు ముందెప్పుడూ మనం చూడలేనివని నాసా పేర్కొంది. ఆర్బిట‌ర్ తీసిన ఫొటోలు సూర్యుడి వాతావరణ పొరలకు సంబంధించినవని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. సూర్యుడిపై మరిన్ని అధ్యయనాలు చేయడానికి ఈ ఫొటోలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని తాము ఆశించ‌లేద‌ని నాసా పేర్కొంది. సూర్యుడికి సంబంధించిన మ‌రిన్ని విషయాలను సోలార్ ఆర్బిటర్ భూమికి చేరవేస్తుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Tags:    

Similar News