కరోనా మహమ్మారికి సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేదు. లక్షణాలు ఒక మోస్తరుగా ఉంటే ఫర్లేదు కానీ.. కాస్త తీవ్రంగా వచ్చినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా అలాంటి పరిస్థితే ఒకప్పటి సినీ నటి.. తాజాగా ఇండిపెండెంట్ ఎంపీగా వ్యవహరిస్తున్న నవనీత్ కౌర్ తాజాగా కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే. ఆమెతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులు పాజిటివ్ గా పరీక్షా ఫలితాలు తేల్చాయి.
తమ కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో స్పందించిన నవనీత్.. తన పిల్లల్ని.. కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ సభ్యులంతా హోం ఐసోలేషన్ లో ఉండగా.. నవనీత్ ను మాత్రం తొలుత అమరావతిలో చికిత్స చేయించారు. ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావటంతో ఆమెను నాగపూర్ కు షిఫ్ట్ చేశారు. అయితే.. అక్కడ ఆమెకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తటం.. శ్వాస తీసుకోవటం సమస్యగా మారటంతో హుటాహుటిన ఆమెను ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. నవనీత్ భర్త ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండగా.. ఆమె మాత్రం అమరావతి ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని.. గతంలోమాదిరి చలాకీగా ప్రజాసేవలో మునిగిపోవాలని ఆశిద్దాం.