కరోనా మహమ్మారి భయంకర పరిస్థుతుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం , ఇక మళ్లీ మాములుగా జీవించవచ్చు అని అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ మరో కొత్త రూపం దాల్చి ప్రజల ముందుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అత్యంతవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.తాజాగా రోమ్ లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒమిక్రాన్ మొదటి ఫోటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్ లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్‌లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్ అని వెల్లడించింది. ఒమిక్రాన్ ఉత్పరివర్తనలు మరింత ప్రమాదకరమైనవని రోమ్ పరిశోధకుల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయని పేర్కొంది. అయితే ఒమిక్రాన్ తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా లేదా వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు.
కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్ లతో పోల్చితే ఓమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది. ఒమిక్రాన్, ఇతర కోవిడ్ వేరియంట్ ల కంటే భిన్న లక్షణాలు ఉన్నాయడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. రోమ్‌లోని ఈ పరిశోధన బృందం కరోనావైరస్‌లో వచ్చే మ్యూటేషన్ల స్పైక్ ప్రొటీన్ త్రీడైమన్షనల్ ఇమేజస్ పై దృష్టిపెట్టిందని మిలన్ స్టేట్ యూనివర్శిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ క్లౌడియా ఆల్టరీ పేర్కొన్నారు. ఇక ఒమిక్రాన్‌తో వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతుందా వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గుతుందా అనే అంశాలపై పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు.