నిన్న క్రిష్ణా జిల్లా... నేడు కర్నూల్...బాబుకు అర్ధమైపోయిందా....?

Update: 2022-11-16 16:40 GMT
ఏపీలో రాజకీయం మారుతోందా. గాలి పూర్తిగా మారుతోందా. ఆ సంగతి రాజకీయ ఉద్ధండుడు చంద్రబాబుకు అందరి కంటే ముందే అర్ధమైపోయిందా. అది చాలా బాగా ఆయనకు అవగాహనకు వచ్చిందా.  లేటెస్ట్ గా రాయలసీమ జిల్లాలోని వైసీపీకి కంచుకోట లాంటి కొడుమూరులో బాబు రోడ్ షో చేస్తే ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు. దాంతో బాబు ఒక్కటే మాట అన్నారు.

ఏపీలో ఇపుడు వీస్తోంది తెలుగుదేశం గాలి. వచ్చేది మేమే. అంతా గుర్తు పెట్టుకోండి అంటూ గట్టిగానే చెప్పారు. నేను ఎవరినీ పిలవలేదు, తెలుగుదేశం పేరిట సభ పెట్టలేదు అయినా ఇంతమంది నా కోసం రోడ్ల మీదకు వచ్చారంటే ఇది చాలదా ఏపీలో వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉందో అని బాబు చెప్పుకొచ్చారు. నేనే కనుక ఈ టైం లో సభ పెట్టి ఉండే కొడుమూరు  సరిపోయేదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా బాబు ఒక మాట అన్నారు. పోలీసులు గుర్తు పెట్టుకోండి, మీరు చట్ట ప్రకారం పనిచేయాలి. లేకపోతే చర్యలు తప్పవు, ఈ జగన్ మిమ్మల్ని అసలు రక్షించడు అని హెచ్చరించారు. ఒక వైసీపీ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ ని హత్య చేస్తే ఆయనకు ఈ రోజుకీ బెయిల్ రాలేదు, ఈ జగన్ రెడ్డి ఏమీ చేయలేపోయాడు, సొంత బాబాయ్ హత్య కేసు ఈ రాష్ట్రంలో సరిగ్గా జరగదని పక్క రాష్ట్రాలకు పంపేశారు అంటే ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి అర్ధం చేసుకోండి అని ప్రజలకు సూచించారు.

ఏపీలో చట్టం అన్నది లేకుండా సీఐడీ డిపార్ట్మెంట్ దూకుడు చేస్తోంది. దాని విషయం కూడా చూస్తామని బాబు వారింగ్ ఇచ్చారు. ఈ సర్కార్ కి వ్వతిరేకంగా మాట్లాడితే పోలీసులను ఇళ్ళకు పంపుతారా కేసులు పెడతారా అన్నీ చూస్తున్నాం, అందరి జాతకాలూ తేల్చేస్తాం అంటూ బాబు వీరావేశమే ఎత్తేశారు.

మంచి పోలీసులు భయపడనక్కరలేదు కానీ ఇపుడు విర్రవీగుతున్న వారికి మాత్రం కధ చాలానే తేల్చాల్సి ఉంటుందని బాబు తనదైన మార్క్ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే క్రిష్ణా జిల్లా మైలవరంలో బాబు రోడ్ షో చేస్తే జనాలు వెల్లువలా వచ్చారు.

పోనీ అక్కడ టీడీపీకి బలం ఉంది కాబట్టి జనాలు వచ్చారు, పైగా రాజధాని ఇష్యూ విషయంలో వైసీపీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వచ్చారు అని సర్దిపెట్టుకున్నా హార్డ్ కోర్ రీజియన్ వైసీపీగా చెప్పుకునే రాయలసీమ అందునా 2014, 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరిగిన జిల్లాలో తెలుగుదేశానికి ఇంతటి ఆదరణ లభిస్తూంటే ఏపీలో ప్రాంతాలతో సంబంధం లేకుండా టోటల్చేంజి అవుతోందా అన్న చర్చ అయితే వస్తోంది.

మూడు రోజుల పాటు చంద్రబాబు కర్నూల్ జిల్లాలో టూర్ చేస్తారు. ఆయన సీమ నుంచే నరుక్కురావలనుకుంటున్నారు. ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక సీమ నుంచి టీడీపీకి ఇప్పటిదాకా వచ్చిన సీట్లు తక్కువే. ఎపుడూ మెజారిటీ దక్కలేదు. కానీ 2024 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆ సీన్ ని రివర్స్ చేస్తూ టీడీపీ అక్కడ విజయఢంకా మోగిస్తుంది అని అంతా అంటున్నారు అంటే వైసీపీకి కంచుకోటల్లోనే  డేంజర్ బెల్స్ మోగుతున్నాయని భావించాలా. ఏమో ముందు ముందు మరింత కధ సాగితేనే తప్ప పూర్తి పిక్చర్ రాదేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News