మంత్రివ‌ర్యా.. మీరు కూడా ఆ బ్యాచేనా?: నెటిజ‌న్లు

Update: 2022-12-30 02:30 GMT
ఆయ‌న రాజ‌కీయాల్లో సీనియ‌ర్‌. పైగా ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. ఉన్న‌త విద్యావంతులు. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో `ప్ర‌భువు`! అలాంటి నాయ‌కుడు కూడా ఇప్పుడు దారిత‌ప్పేయ‌డం.. ఏపీలోచ‌ర్చ‌కు దారితీస్తోంది. ముఖ్యంగా నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఎందుకంటే.. ఎప్పుడూ సౌమ్యంగా ఉండ‌డంతోపాటు..నిబ‌ద్ధ‌త తో కూడిన రాజ‌కీయాలు చేయ‌డంలో ఆయ‌న దిట్ట‌గా పేరుపొందారు.

నోరు విప్పి.. ఉచితార్థంగా ఆయ‌న ఎవ‌రిపైనా నోరు పారేసుకోరు. ఆయ‌నే గుంటూరు జిల్లా వేమూరు నియో జక‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న మేరుగ నాగార్జున పూర్వాశ్ర‌మంలో ఆయ‌న ప్రొఫె స‌ర్‌గా ప‌నిచేశారు. అన‌ర్గ‌ళ‌మైన ఇంగ్లీష్‌లో దంచికొట్ట‌గ‌ల‌రు. విష‌యం ఏదైనా నిశితంగా ఆలోచిస్తార‌నే పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ, అదేంటో.. ఆయ‌న గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

వాస్తవానికి మేరుగ పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌రు. స‌బ్జెక్టు మాట్లాడ‌తారు. ఇదే ఆయ‌న‌కు 150 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్ర‌త్యేక‌త‌ను తీసుకువ‌చ్చింది. కానీ, ఆయ‌న మంత్రి అయిన త‌ర్వాత ఆయ‌న పూర్తిగా మారిపోయార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు. నిజానికి వైసీపీలో ఆవేశంగా మాట్లాడే బ్యాచ్ ఉంద‌నేది ఒక టాక్‌. వారిలో కొడాలి నాని జోగి ర‌మేష్‌, పేర్ని నాని, గుడివాడ అమ‌ర్నాథ్, రోజా త‌దిత‌రులు ఉన్నార‌ట‌!

ఇప్పుడు ఇదే బ్యాచ్‌లో మేరుగ కూడా చేరిపోయార‌ని అంటున్నారు. స‌రే.. ఇంత‌కీ మేరుగ ప‌డిన ఆవేశం.. చేసిన వాద‌న ఏంటంటే.. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ఇంకా పాద‌యాత్ర కూడా ప్రారాంభించ కుండానే.. (షెడ్యూల్ ప్ర‌కారం.. జ‌న‌వ‌రి 27 నుంచి ప్రారంభించాలి) మేరుగ ఘాటుగా స్పందించారు. పాద‌యాత్ర‌ను అడ్డుకుని తీరుతామ‌ని.. ఆపేస్తామ‌ని అన్నారు! దీనిపైనే నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదేం తీరు మంత్రివ‌ర్యా.. మీరు కూడా ఆ బ్యాచ్‌లో చేరారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News