జగన్ ఓకే కానీ.. హై కమాండ్ ని నమ్మం అంటున్న ఎమ్మెల్యేలు...?

Update: 2022-11-18 02:30 GMT
వైసీపీలో వింత పరిస్థితి ఉంది. అంతా వన్ సైడ్ యాక్షనే. అసలు వైసీపీ ఏర్పాటు, దాని దూకుడు, రాజకీయాలు, పాదయాత్రలు, 2019 ఎన్నికల్లో గెలుపు అంతా వన్ సైడే. దాంతో మూడున్నరేళ్ళ వైసీపీ పాలన కూడా వన్ సైడెడ్ గానే సాగుతోంది. ఇక పార్టీలోనూ షరా మామూలుగా వన్ సైడెడ్ గానే జగన్ డెసిషన్స్ ఉంటాయి. జస్ట్ ఆయన రివ్యూస్ పేరిట పార్టీ జనలతో అలా పంచుకుంటూ ఉంటారంతే అని ప్రచారంలో ఉన్న మాటగా చెబుతారు.

ఇదిలా ఉంటే జగన్ వరకూ తీసుకుంటే ఆయన అంతా ఏకపక్షంగా సాగుతుందని, పార్టీలో కూడా అదే పరిస్థితి అని అంచనా వేసుకుంటున్నారు. కానీ జగన్ వద్ద అంతా ఓకే అని చెబుతున్న నాయకులలో ఎంతమంది ఆయన చేస్తున్న దిశా నిర్దేశానికి బద్ధులు అవుతున్నారు అన్నదే చర్చ. అలాగే జగన్ ఆలోచనలతో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది మరి.

ఎందుకంటే అంతా బాగుంది అనుకుంటూ సాగే సమీక్షా సమావేశాలల్లో బుర్ర ఊపుతూ అటెండ్ అయ్యే నాయకులు బయట చెప్పే విషయాలు వేరేగా ఉంటున్నాయని అంటున్నారు. మొత్తానికి మొత్తం సీట్లు పార్టీ గెలుస్తుంది అంటే అవును అంటూ చెప్పే వారే బయటకు వచ్చి అలా ఉండదు కదా అని కూడబలుక్కుంటున్న నేపధ్యం ఉంది.

ఇదిలా ఉంటే టికెట్ల విషయంలో కూడా అధినాయకత్వం మీద నాయకులు ఎంతవరకూ నమ్మకం ఉంచుతున్నారు అన్నదే తెలియడంలేదు అంటున్నారు. ఎందుకంటే సర్వేలనే హై కమాండ్ నమ్ముకుంటోంది. అక్కడ కనుక తేడా వస్తే మాత్రం కట్ చేసి పారేస్తామనే చెబుతున్నారు. దాంతో హై కమాండ్ బాగా పనిచేసుకోండి మళ్లీ మీకే టికెట్లు ఇస్తాం, మీకే అవకాశాలు ఉంటాయని ఎంతలా చెబుతున్నా ఎమ్మెల్యేలు అయితే నమ్మడం లేదు.

అయితే ప్రస్తుతం సాగుతోంది మూడవ సంవత్సరం. మరో ఆరు నెలలు ఆగితే నాలుగేళ్ల పాలన నిండుతుంది. అప్పటికి ప్రభుత్వం తీరు మీద అసలైన ప్రజాభిప్రాయం అన్నది బయటకు వస్తుంది అన్న అంచనా కూడా ఉంది. అలాగే ఇతర పార్టీల గ్రాఫ్ వాటిలో ఉన్న అవకాశాలు, తమకు అనుకూలంగా ఉండే రాజకీయ పరిణామలాను ఇవన్నీ బేరీజు వేసుకుంటూ గడుపుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు అని అంటున్నారు.

అందుకే వైసీపీలో చూస్తే ఎమ్మెల్యేలు రాజకీయ వ్యూహాలు వేరేగా ఉన్నాయా అన్న చర్చ వస్తోంది. అటు హై కమాండ్ కూడా తమ మాట వింటున్నారు అని అనుకుంటూనే డౌట్ ఉన్న వారి మీద నిఘా పెడుతోంది అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అంతా ఓకే అని జగన్ అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ మాటే వింటున్నారు అని భావిస్తున్నారు.

కానీ పార్టీలో గుసగుసలు ఏమిటి అంటే చాలా మంది ఎమ్మెల్యేలు వింటున్నట్లుగా ఉన్నారు అంతే తప్ప హై కమాండ్ ని పూర్తిగా నమ్మడంలేదు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి పార్టీ గెలుపు మీద రెండు తమ గెలుపు మీద, అలాగే తమకు టికెట్ వచ్చే దాని మీద అందుకే నమ్మకంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత వరకూ ఉన్నారన్నదే పెద్ద చర్చ మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News