టీడీపీ బాదుడే బాదుడు ఫెయిల్ అయిందా...?

Update: 2022-08-30 13:50 GMT
తెలుగుదేశం పార్టీ ఇంకా పాత రోజులలోనే ఉంది. ఆ పార్టీ ఓల్డ్ ట్రెండ్ నే ఫాలో అవుతోంది. రాజకీయం ఎప్పటికపుడు మారుతోంది. దాంతో పాటు కొత్త నాయకులు రంగంలో ఉన్నారు. అందువల్ల పాలిటిక్స్ లో ట్రిక్స్ మార్చాలి. అయితే ఎర్లీ సెవెంటీస్ నుంచి ఒకే టైప్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబుకు నయా పాలిటిక్స్ వంటబట్టడంలేదు అనే అంటున్నారు.

ఏపీలో బాదుడే బాదుడు అంటూ టీడీపీ ఒక కార్యక్రమం చేపట్టింది. అయితే మొదట్లో అది బాగానే ఉంది అనిపించినా ఆ తరువాత చూస్తే ఒక్కసారిగా డౌన్ అవుతోంది. దానికి కారణం ఎంచుకున్న కంటెంట్ జనాలకు ఎక్కడంలేదనే అంటున్నారు. ఏపీలో ఇపుడున్న పరిస్థితిల్లో అప్పు తెచ్చి చేసినా మాకు ఏంటి అనే పరిస్థితి జనాలలో ఉంది.

ఏపీ అప్పుల్లో ఉందని, జగన్ అప్పులు తెచ్చి డబ్బులు ఇస్తున్నాడు అని అందుకే పెద్ద ఎత్తున రేట్లు ఏపీలో పెరుగుతున్నాయని చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం డిజైన్ చేశారు. దీన్నే జనాలలో పెట్టమన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మొదట్లో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ జనాలు కూడా ఆ తరువాత మెల్లగా సైడ్ అవుతున్నారు. దానికి కారణం వారిది బాదుడు సమస్య కాదు, టికెట్ల సమస్య.

ముందు మాకు ఎక్కడ సీటు ఇస్తున్నారో చెప్పమని చంద్రబాబుని లోకేష్ ని అడుగుతున్నారు. ఇపుడున్న పరిస్థితులలో తాము ఖర్చు పెట్టుకుని జనాల్లో తిరిగినా కేసులు పెట్టించుకుని అరెస్టులు అయినా టికెట్ కి ఠికాణా లేకపోతే అంతా వేస్ట్ కదా అన్న బాధ తమ్ముళ్ళది. అందుకే ముందు టికెట్ల సంగతి తేల్చమని వారు అంటున్నారుట.

ఈ రోజు పెద్ద ఎత్తున డబ్బులు తీసి ఖర్చు చేస్తాం, జనాల్లోకి వెళ్తాం, కానీ రేపటి రోజున పొత్తులలో భాగంగా తమ సీట్లు పోతే అవి ఏ బీజేపీకో, జనసేనకు వెళ్తే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. అందుకే టీడీపీలో పెద్ద ఎత్తున నాయకులు ఉన్నారు. అలాగే ఇంచార్జిలు ఉన్నా కూడా ఎవరూ జనంలోకి రావడంలేదు అని అంటున్నారు.

వారి వాదనలో నిజం ఉంది కదా. పార్టీ అంటేనే ఖర్చు చేయాలి. ఇక రాజకీయం అంటే ముందూ వెనకా చూసుకోవాల్సిన పని లేదు. కానీ కనీసం అయినా గ్యారంటీ ఉంటే వారు పులులు మాదిరిగా ముందుకు దూకుతారు. మీరే పోటీకి దిగుతారు. ఇక మీ ఇష్టం అంటే వారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. కానీ చంద్రబాబు ఇంకా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ చివరి నిముషం వరకూ తెమల్చరు అన్న పేరుంది.

మరి అలా డబ్బు ఖర్చు పెట్టుకుని టికెట్ దక్కపోతే తమ గతేం కాను అని ఆలోచిస్తున్న వారికి భరోసా ఇచ్చి ముందుకు నడిపించాల్సింది పార్టీ నాయకత్వమే. అలాగే జనాలలో ఉండేలా మంచి కంటెంట్ తో ఉద్యమాలు చేయాలి. ఆ విధంగా జనం మూడ్ ని ఎప్పటికపుడు గమనించాలి. కానీ టీడీపీ స్కూల్ చూస్తే ఇంకా అప్ టో  డేట్ కావాల్సి ఉందనే అంటున్నారు. చూడాలి మరి కొత్త మార్పు ఉంటుందేమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News