దారుణం: ఫ్రీజర్ ట్రక్కుల్లో కరోనా శవాలు

Update: 2020-04-23 11:10 GMT
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్న ప్రాంతం న్యూయార్క్. జనాలు ఇక్కడ పిట్టల్లా రాలుతున్నారు. న్యూయార్క్‌లో మరణాల సంఖ్య పెరగడంతో, కరోనావైరస్ రోగుల మృతదేహాలను ఖననం చేయడం చాలా సమస్యాత్మకంగా మారింది. తాజాగా అక్కడి మీడియా కథనాల ప్రకారం, మృతదేహాలను ఖననం చేయకుండా దాచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులు తీసుకోవడం లేదు. వారిని చూడడానికి కూడా అవకాశం లేదు. దీంతో వారిని ఎక్కడ ఖననం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వారి సమాధులు కూడా లేకపోవడం ప్రజలను కృంగుబాటుకు గురిచేస్తోంది. అందుకే తీవ్రత తగ్గాక ఎవరి మృతదేహాలను వారికి ఇవ్వడం లేదా.? వారు సూచించిన ఫలానా చోట ఖననం చేసేందుకు అధికారులు ప్లాన్ చేశారు. అందుకే కరోనా మృతదేహాల సామూహిక ఖననాలకు తాజాగా స్వస్తి పలికారు.

మృతదేహాలను హార్ట్ ద్వీపంలో ఖననం చేయడానికి బదులుగా, వారు వాటిని తాత్కాలికంగా ఫ్రీజర్ ట్రక్కులలో దాచాలని నిర్ణయించారు. తద్వారా కరోనా శవాలను కుళ్ళిపోకుండా నిరోధించవచ్చు. ఫ్రీజర్ ట్రక్కులకు మృతదేహాలను ఏడాదికి పైగా నిల్వ చేసే సామర్థ్యం ఉంది.

ఈ విధంగా, సాధారణ స్థితి పునరుద్ధరించబడినప్పుడు కుటుంబాలు వారి మరణించిన కుటుంబ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లవచ్చని సూచిస్తున్నారు. వారు సూచించిన స్థలంలోనే ఖననం చేస్తామని అధికారులు చెబుతున్నారు అయితే మృతదేహాల తాత్కాలిక నిల్వ కోసం సరిపడా ఫ్రీజర్ ట్రక్కులు ఉన్నాయా లేవా..? వాటి సంఖ్యపై అనుమానాలున్నాయి. రోగుల సంఖ్య మరియు మరణాలను తగ్గితే ఈ ఫ్రీజర్ ట్రక్కులు సరిపోయే అవకాశం ఉంది.
Tags:    

Similar News