ఆ గ‌ల్ఫ్ దేశంలో ఐటీ క‌ట్ట‌న‌వ‌స‌రం లేద‌ట‌

Update: 2017-04-10 09:41 GMT
క‌ఠిన శిక్ష‌ల‌కు పెట్టింది పేర‌యిన గ‌ల్ఫ్ సామ్రాజ్యంలోని సౌదీ అరేబియా ప్ర‌భుత్వం ఊహించ‌ని నిర్ణ‌యం వెలువ‌రించింది. త‌మ దేశ పౌరులు ఎలాంటి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించింది. అంతేకాదు దేశంలోని కంపెనీలు కూడా లాభాల‌పై ప‌న్నులు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. సౌదీ అర్థిక మంత్రి ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. ఇందుకు కార‌ణం త‌మ దేశంలో చేప‌డుతున్న నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌ని ఆయ‌న వివ‌రించారు.

అంత‌ర్జాతీయంగా చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో 2014 తర్వాత ఆయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. ఈ ప‌రిణామాన్ని సమగ్రంగా, సమూలంగా పరిశీలించిన సౌదీ అరేబియా ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు సిద్ధ‌ప‌డింది. కొత్త పన్నులు, ప్రైవేటీకరణ, పెట్టుబడుల వ్యూహాలు మార్పు, ప్రభుత్వ ఖర్చుల్లో తగ్గింపు వంటి వాటిని చేపట్టింది. అందులో భాగంగానే ఆదాయ‌పు ప‌న్నును ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించుకుంది.  వాల్యు యాడెడ్ పన్ను కూడా 5 శాతం కంటే ఎక్కువ పెంచడానికి వీలు లేకుండా ప్లాన్ చేస్తున్నామని సౌదీ ఆర్థికమంత్రి మీడియాకు వెల్ల‌డించారు. ఇంధ‌నం కాకుండా దక్కే ఆదాయాన్ని పెంచుకోవ‌డంలో భాగంగా వ‌చ్చే ఏడాది నుంచి 5 శాతం వాల్యూ యాడెట్ ట్యాక్స్ విధానం తీసుకురానున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News