కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన మహిళ ఒకరిని దుండగులు గతంలో నిర్భయ తరహాలో దారుణంగా అత్యాచారం చేసి ప్రైవేటు పార్ట్స్‌లో రాడ్డు దింపారని వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన అంతా అబద్ధమని.. నిందితులతో ఆస్తి తగాదాలు ఉండటంతో ఆ మహిళే కావాలని తన బాయ్‌ఫ్రెండుతో కలసి డ్రామాలు ఆడిందని వెల్లడైంది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్–ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని 36 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం ఘజియాబాద్‌లో ఒక ఫంక్షన్‌కు వెళ్లింది. రాత్రి పూట బస్సు కోసం వేచిచూస్తుండగా ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగి అందులో ఉన్న యువకులు ఆమెను కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు దారుణంగా అత్యాచారం చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె జననాంగాల్లో రాడ్లు పెట్టి గోనె సంచెలో కట్టి ఢిల్లీ–ఘజియాబాద్ రూట్‌లోని ఆశ్రమ్ రోడ్డు దగ్గర పడేశారని వార్తలు హల్చల్ చేశాయి. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించి అక్టోబర్ 19న ఓ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. పోలీసుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో వారిపై ఉద్దేశపూర్వకంగానే మహిళ కేసు పెట్టిందని వెల్లడైంది. మరోవైపు ఆమెకు వైద్య చికిత్సలు అందించిన ఢిల్లీ జీటీబీ ఆస్పత్రి ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చిచెప్పింది. పైగా ఆమె ఆచూకీ లభ్యమైన తర్వాత రెండు ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించింది. దీంతో పోలీసులకు అనుమానాలు మరింత బలపడ్డాయి.
చివరికి ఆమె మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేసి.. అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. స్నేహితురాలి బర్త్ డే పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో.. బస్టాపులో తాను వేచి ఉండగా కారులో వచ్చిన నిందితులు తనను అపహరించుకు పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారని మహిళ ఫిర్యాదు చేసింది. అయితే..
ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు.. అదే స్పాట్‌లో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దీంతో అత్యాచారం అనేది అంతా మోసమని వెల్లడైంది. ఈ విషయం బయటపడకుండా ఆమె తన స్నేహితుడికి పేటీఎం ద్వారా డబ్బు కూడా పంపినట్టు తేలింది. తనపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేయడానికి అతడికి ఈ డబ్బు ఇచ్చిందని పోలీసుల విచారణలో బయటపడింది.
ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండడంతోనే ఆమె అలా నాటకం ఆడిందని యూపీ రీజినల్ పోలీస్ చీఫ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తనపై రెండు రోజులు సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె చెబుతున్న టైంలో.. ఆమె తన స్నేహితులతో రిసార్ట్‌లో ఎంజాయ్ చేసిందని వెల్లడైంది. ఆ తర్వాత వాళ్ల సహకారంతోనే ఈ గ్యాంగ్ రేప్ డ్రామాకు తెరతీసిందని బయటపడింది.దీంతో నివ్వెరపోవడం పోలీసుల వంతైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.