హుజూరాబాద్ లో ఈటల కాదు.. ట్విస్ట్ ఇదే

Update: 2021-07-18 09:45 GMT
హుజూరాబాద్ ఎన్నికల వేడి రగులుకుంటోంది. ఇప్పటికే బీజేపీ తరుఫున ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అందరికంటే ముందే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులకు అందనంతగా దూసుకెళుతున్నారు.

ఇన్నాళ్లు బీజేపీ తరుఫున ఈటల రాజేందర్ మాత్రమే అభ్యర్థి అని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తున్న వేళ ట్విస్ట్ వచ్చింది.

హుజూరాబాద్ ఎన్నికలపై ఈటల రాజేందర్ సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ పోటీచేసినా.. తాను పోటీచేసినా ఒక్కటేనని ఆమె వెల్లడించారు.

ఈటల రాజేందర్ పోటీకి దూరంగా ఉంటారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కూడా తన భర్త ఈటల రాజేందర్ ను వెనుకుండి నడిపించానని ఆయన భార్య జమున చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన భర్త ఈటల రాజేందర్ ను వెనకుండి నడిపించానని గుర్తు చేశారు.

ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని జమున చెప్పుకొచ్చారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి చేసిన తాజా వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఇక హుజూరాబాద్ లోని పలు వార్డుల్లో శనివారం ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంటింటా ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా మామిండ్లవాడలో ఓ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తుండగా శ్రీనివాస్ అనే వ్యక్తి జమునను నిలదీశారు. తన కుమారుడు ప్రమాదంలో మృతి చెందగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని.. ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదని అన్నారు.

దీన్ని బట్టి హుజూరాబాద్ లో పోటీ చేసేది ఈటల కాదని.. జమునా రెడ్డి అని అర్థమవుతోంది. మరి ఇది నిజమా? కాదా?బీజేపీ ఎలాంటి ఎత్తు వేసిందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News