ఫాంహౌస్ కోసం నిధుల దుర్వినియోగం.. మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు?

Update: 2021-05-28 11:30 GMT
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎస్ఎస్.యూ.ఐ మరో ఆరోపణ చేసింది.  ఎస్ఎస్.యూ.ఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తాజాగా మీడియా ముఖంగా మంత్రిపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు చేశారు. తన ఎంపీ ల్యాండ్స్ నిధులను సొంత ఫామ్ హౌస్ రోడ్ల కోసం మల్లారెడ్డి దుర్వినియోగం చేశాడని ఆరోపించాడు.

ఇక వెంకట్ బల్మూర్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లోని సుభాష్ నగర్ లో సర్వేనంబర్ 72,73లోని ప్రభుత్వ భూమిలో కోర్టు స్టేను సైతం మంత్రి మల్లారెడ్డి ధిక్కరించారని.. దీన్ని సర్వే నంబర్ 70గా సృష్టించి చెరువు కాలువను కబ్జా చేస్తూ నిర్మాణం చేపట్టారని సంచలన ఆరోపణలు చేశారు. గత సంవత్సరం కురిసిన వానలకు కాలువ మూసేయడంతో సుభాష్ నగర్ మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.

లాక్డౌన్ తో వచ్చిన అవకాశంతో మంత్రి మల్లారెడ్డి తిరిగి ఇక్కడ నిర్మాణం ప్రారంభించారని.. కోర్టు స్టేను సైతం ధిక్కరిస్తున్నారని వెంకట్ ఆరోపించారు. తన ఎంపీ ల్యాండ్స్ నిధులను సైతం గతంలో సొంత ఫాంహౌస్ కు రోడ్డు వేసేందుకు ఉపయోగించాడని ఎస్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు ఆరోపించాడు.  

ఫాక్స్ సాగర్ చెరువును ఆనుకొని ఉన్న ఈ ఫాంహౌస్ భూములను ప్రభుత్వం సర్వే చేయాలని వెంకట్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూమి కబ్జాకు గురైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలని వెంకట్ కోరారు. ఒక ఆస్పత్రిని లీజుకు తీసుకొని మంత్రి ఈటలతో ప్రారంభించి నేడు వేరకొకరిని దాన్ని కట్టబెట్టాడని వెంకట్ ఆరోపించారు. దీనిపై నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.

https://www.facebook.com/watch/?v=2456011217877316
Tags:    

Similar News