నూపుర్ శర్మకు ఎట్టకేలకో కీలక నేత మద్దతు.. మరి అక్బరుద్దీన్ క్షమాపణ ఏదీ!
ఒక టీవీ డిబేట్ చర్చలో మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వ్యవహారం దేశవిదేశాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమెను బీజేపీ అధిష్టానం పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. మరోవైపు విదేశాల్లోనూ.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో, ముస్లింలు అధికంగా ఉన్న దేశాల్లో ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలు దేశాలు భారత రాయబారులను పిలిపించి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. భారత్ ఉత్పత్తులను కొనవద్దనే వరకు ఈ నిరసనలు వెళ్లాయి. మరోవైపు దేశవ్యాప్తంగా నూపుర్ శర్మపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చివరకు సుప్రీంకోర్టు సైతం ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశానికి ఆమె క్షమాపణ చెప్పాలంటూ ఆదేశించింది.
అయితే తాజాగా ఇప్పుడు నూపుర్ శర్మకు తాను బేషరతుగా మద్దతు ఇస్తున్నానని.. ఆమెకు తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే తెలిపారు. నూపుర్ శర్మను తప్పుబడుతున్నవారు మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ను ఎందుకు క్షమాపణ అడగరని నిలదీశారు.
అక్బరుద్దీన్ పలుమార్లు హిందూ దేవుళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని రాజ్ థాకరే గుర్తు చేశారు. అలాగే వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ సైతం హిందూ దేవుళ్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆయన కూడా క్షమాపణ చెప్పలేదన్నారు. అక్బరుద్దీన్, జకీర్ నాయక్ ఇద్దరూ నూపుర్ శర్మ కంటే ముందే హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేశారన్నారు.
అక్బరుద్దీన్, జకీర్ నాయక్ వంటి నేతలు హిందూ దేవుళ్లను కించపరిచారని.. వారిని వదిలేసి నూపుర్ శర్మను అందరూ క్షమాపణలు అడగడం సమంజసం కాదని రాజ్ థాకరే మండిపడ్డారు. తాను నూపుర్ శర్మను మద్దతు ఇస్తున్నానని వెల్లడించారు. భేషరతుగా తన సహకారం ఆమెకు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపైనా రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్ థాకరే ఆశయాలు, లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. తాను శివసేనలో ఉన్నప్పుడు బాలాసాహెబ్ ఎలా వ్యవహరించేవారో తనకు తెలుసన్నారు.
ఏ పార్టీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వారికే ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేవారని గుర్తు చేశారు. మరి ఇలాంటి విధానం ఇప్పుడెలా మారింది? అని నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని మోదీ, అమిత్ షా స్పష్టంగానే చెప్పారు. అప్పుడు లేని అభ్యంతరం ఎన్నికలు ముగిశాక ఎలా వచ్చింది? అని రాజ్ థాకరే నిలదీశారు.