ఒంట‌రి దీవిలో లేడీ ఎంపీ బికినీ ట్రీట్

Update: 2019-08-11 13:07 GMT
నుస్రాత్ జ‌హాన్ రుహీ జైన్ ..  బెంగాలీ నటి కం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఇప్ప‌టికే సుప‌రిచితం.  నుస్రత్ జహాన్ రాజ‌కీయారంగేట్రం ల‌వ్ మ్యారేజ్ ఆల్ టైమ్ హాట్ టాపిక్. స్వ‌త‌హాగా టాప్ మోడల్ కం క‌థానాయిక అయిన నుస్ర‌త్ కోల్‌కతాకు చెందిన బిజినెస్‌ మేన్ నిఖిల్ జైన్ ని పెళ్లాడారు. టర్కీలోని బోడ్రమ్‌లో ఈ జంట వివాహం జ‌రిగింది. ఆ త‌ర్వాత‌ నుస్రాత్ త‌న భ‌ర్త నిఖిల్ తో క‌లిసి సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్ల వైర‌ల్ అయ్యాయి. లేడీ  హాట్ ఎంపీ ఫ‌రెవ‌ర్!! అంటూ యూత్ ఫిదా అయిపోయారు. ప్ర‌స్తుతం మ‌రోసారి నూస్ర‌త్ మారిష‌స్ విహారం అంతే హాట్ టాపిక్ గా మారింది.

నుస్ర‌త్ కెరీర్ సంగ‌తులు ప‌రిశీలిస్తే.. 2010 మిస్ కోల్ క‌త‌ గా నుస్రాత్ టైటిల్ గెలుచుకుని అటుపై సినీ ఆరంగేట్రం చేశారు. రాజ్ చ‌క్ర‌బ‌ర్తి తెర‌కెక్కించిన షొత్రు అనే చిత్రంతో 2011లో క‌థానాయిక‌గా తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. అటుపై బోయ్ ఫ్రెండ్ నిఖిల్ ని పెళ్లాడారు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా రాజ‌కీయారంగేట్రం చేస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా భాజ‌పా అభ్య‌ర్థి స‌యంత‌న్ బ‌సుపై మూడున్న‌ర ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో నెగ్గారు.

మారిష‌స్ లో నుస్ర‌త్- నిఖిల్ జైన్ జోడీ రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్ప‌టి ఫోటోలు వెబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. లేడీ ఎంపీ కొత్త జంట‌కు గోల్స్ నిర్ధేశించారంటూ ఈ ఫోటోలకు ఒక‌టే వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. అంతేకాదు మారిస‌ష్ విహారంలో 29 ఏళ్ల హాట్ ఎంపీ బికినీల‌తో చెల‌రేగిపోవ‌డంపైనా వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఈ త‌ర‌హా ఎంజాయ్ మెంట్ వేరొక ఎంపీకి సాధ్యం కాదేమో?
Tags:    

Similar News