ఏపీని హార్డ్ వేర్ హబ్ గా చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వప్నం వాస్తవరూపం దాలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు సీమాంధ్రలో మొబైల్ తయారీ కేంద్రాల్ని ఏర్పాటు చేసుకుండటం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో కంపెనీ ఏపీకి వచ్చింది.
చిత్తూరు జిల్లా శ్రీసిటీలోని ఫాక్స్ కాన్ కేంద్రంలో చైనాకు చెందిన వన్ ప్లస్ సెల్ ఫోన్ల తయారు మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఒప్పందం తాజాగా పూర్తి అయ్యింది. స్మార్ట్ ఫోన్లను దేశీయంగా తయారు చేయాలన్న లక్ష్యంలో భాగంగా.. తొలిదశలో శ్రీసిటీలో ఉన్న ఫాక్స్ కాన్ కేంద్రంలో తయారు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏపీ మేకిన్ వన్ ప్లస్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.
భారత్ లో సెల్ ఫోన్లు తయారీ చేయటం ద్వారా.. తమ మార్కెట్ మరింత స్థిరపడుతుందని కంపెనీ ఆశాబావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అసెంబ్లింగ్ చేసి.. వన్ ప్లస్ ఫోన్లను తయారు చేస్తారు. డిసెంబర్ నాటికి ప్రతి నెల 5 లక్షల మొబైళ్ల తయారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. వన్ ప్లస్ కంపెనీ రాకతో.. దాదాపు వెయ్యి మంది వరకు ఉపాధి అవకాశాలు లభించే వీలుంది. ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న మొబైల్ ఫోన్ల కంపెనీ రాకతో ఏపీని హార్డ్ వేర్ హబ్ గా మార్చలన్న లక్ష్యం దిశగా అడుగులు వడివడిగా పడుతున్నట్లు చెప్పొచ్చు.