వరుసగా 40-50 కేసులు నమోదవుతూ కేసీఆర్ కు టెన్షన్ పెంచుతున్న కరోనా ఈరోజు కొంత ఊరటను ఇచ్చింది. తెలంగాణలో అతితక్కువగా 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అతి తక్కువ అంటే... అన్ని రాష్ట్రాలతో పోల్చుకుని కాదు. కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో నమోదై ఈరోజు చాలా తక్కువ కేసులు కనిపించడం ఊరట. అంతేకాదు... ఈరోజు నమోదైన కేసున్నీ కేవలం మూడు ప్రాంతాలవే. అవి కూడా హాట్ స్పాట్ ప్రాంతాలే.
తెలంగాణలో హైదరాబాదు, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలు కరోనాకు బాగా ప్రభావితం అయ్యాయి. కొన్ని రోజులు చాాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు కేవలం 15 కేసులు రాగా 10 హైదరాబాదులో వచ్చాయి. 3 సూర్యాపేటలో, 2 గద్వాల నుంచి వచ్చాయి. 33 జిల్లాల్లో 30 జిల్లాల నుంచి ఒక్క కొత్త కేసు లేకపోవడం అదృష్టం. కేవలం మూడే జిల్లాల్లో నమోదవగా... ఇప్పటికే కేసీఆర్ హాట్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక అధికారుల నియమించి పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం కేసుల సంఖ్య 943 కాగా యాక్టివ్ గా ఉన్న కేసులు 725 మాత్రమే. ఈరోజు ఒకే ఒక మరణం సంభవించింది. గత వారం రోజుల్లే అతితక్కువ కేసులు నమోదైంది ఈరోజే.
ప్రపంచంలో ప్రతి అప్ డేట్ ను చాలా సీరియస్ గా స్వీకరించే కేసీఆర్ తాజాగా WHO చెప్పిన 14 రోజుల క్వారంటైన్ అనే ఇంకుబేషన్ పీరియడ్ ను కూడా మార్చేశారు. కొందరిలో 4 వారాలు కూడా లక్షణాలు గుంభనంగా ఉంటుండంతో క్వారంటైన్, ఐసోలేషన్ టైంను 28 రోజులకు పెంచుతూ ఆదేశాలు సవరించారు. ఎక్కడా నిర్లక్ష్యాన్ని కేసీఆర్ సహించడం లేదు. సమర్థులైన అధికారులను ఎంచుకుని ... నిర్లక్ష్యం చూపిన వారిని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తీసి పక్కన పెడుతున్నారు.