సరిగ్గా ఇదే మాటను పదేపదే ప్రస్తావిస్తున్నారు ఢిల్లీలోని విశ్వాస్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మ. తన దగ్గర తుపాకీ కానీ ఉండి ఉంటే కాల్చి పారేసేవడినని.. కన్నతల్లిని ఎవరైనా తిడితే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు.. నా తల్లిని తిట్టినవాడిని కొట్టకుండా ఉండలేనంటూ తాను చేసిన పనిని క్లియర్ గా ఆయన చెప్పేస్తున్నారు. కొట్టటం తర్వాత.. నా చేతిలో కానీ తుపాకీ ఉండి ఉంటే కాల్చేసేవాడినని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
ఢిల్లీలోని పాటియాలా కోర్టు వద్ద జేఎన్ యూ విద్యార్థి ఒకరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న నేపథ్యంలో.. రోడ్డు మీద వెళుతున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రకాష్ శర్మ.. ఒక్క ఉదుటున అతడి మీద దాడి చేయటం తెలిసిందే. దీనికి మీడియాలో ప్రాధాన్యత ఇస్తూ ఫోటోలు ప్రముఖంగా రావటంతో ఓం ప్రకాష్ శర్మ తాజాగా స్పందించారు.
తన దగ్గర తుపాకీ లేదని.. ఉంటే కాల్చిపారేసి ఉండేవాడినని మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు నినాదాలుచేసినా కొడతానని ఆయన వ్యాఖ్యానించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాక్ కు అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తిని కొట్టేసిన సదరు ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా తనకూ గాయాలు అయ్యాయంటూ కేసు పెట్టారు.