హాట్ హాట్ గా మారిన తెలంగాణ అసెంబ్లీ

Update: 2017-11-07 08:34 GMT
ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా యాభై రోజుల పాటు అసెంబ్లీని నిర్వ‌హించాల‌ని తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల మీద ఆస‌క్తి పెద్ద‌గా క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఏదో ప‌ది రోజులంటే ఆ వ్య‌వ‌హారం వేరుగా ఉంటుంది. అందులోకి అధికార‌పక్షం దూకుడికి క‌ళ్లెం వేసే విప‌క్ష నేత ఉంటే.. ఏ అధికార‌ప‌క్షం మాత్రం యాభ‌య్యేసి రోజులు అసెంబ్లీ స‌మావేశాల్ని నిర్వ‌హించే సాహ‌సం చేయ‌గ‌ల‌దు?

తెలంగాణలో ఉన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌తో సీఎం కేసీఆర్ యాభై రోజుల అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌కు ఓకే చెప్పేశారు. దీంతో.. సాదాసీదాగా స‌భ సాగుతున్న‌ట్లుగా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) మాత్రం కాస్త భిన్న‌మైన ప‌రిస్థితి తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఉద్యోగాల భ‌ర్తీ అంశంపై స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌పాలంటూ విప‌క్ష‌లు డిమాండ్ చేశాయి.

ఇందుకు అధికార‌ప‌క్షం నో అంటే నో అనే ప‌రిస్థితి. విప‌క్షం కోరినంత‌నే చ‌ర్చ‌కు అధికార‌ప‌క్షం రెఢీ అన‌టం ఉండ‌దుక‌దా. దీనికి తోడు.. స్పీక‌ర్ సైతం ఉద్యోగాల భ‌ర్తీ అంశంపై చ‌ర్చ‌కు స‌భ‌లో అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో.. అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌టంతో స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిరుద్యోగ స‌మ‌స్య‌పై చ‌ర్చ జ‌ర‌పాల‌న్న విప‌క్ష డిమాండ్‌ కు అధికార‌ప‌క్షం నో అన‌టంపై విప‌క్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. త‌మ‌కు నిర‌స‌న తెలిపే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. దీనికి ప్ర‌తిగా స‌భ‌ను స‌జావుగా న‌డిపేందుకు విప‌క్షం స‌హ‌క‌రించాలంటూ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి హిత‌వు ప‌లికారు.

ఈ స‌మ‌యంలో క‌లుగ‌జేసుకున్న మంత్రి కేటీఆర్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని.. ఈ విష‌య‌మై విప‌క్షాలు రార్దాంతం చేస్తున్నాయంటూ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. ఇలా అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య నెల‌కొన్న గంద‌ర‌గోళంలోనే స‌భ సాగుతోంది. ప్ర‌శ్నోత్త‌రాల కార్క‌క్ర‌మాన్ని అధికార‌ప‌క్షం కొన‌సాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిర‌స‌న చేస్తున్న బీజేవైఎం కార్య‌కర్త‌లను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పోలీస్ రాష్ట్రంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. దీనికి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన కేటీఆర్ పబ్లిసిటీ కోస‌మే విప‌క్షం విమ‌ర్శ‌లు చేస్తుందే త‌ప్పించి.. మ‌రింకేమీ లేద‌న్నారు. స‌భ‌ను స‌జావుగా న‌డిపించాల‌ని కోరారు.  కొద్ది రోజులుగా చ‌ప్ప‌గా సాగిపోతున్న అసెంబ్లీ తాజా ప‌రిణామాల‌తో హాట్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News