20 ఏళ్లుగా ఖాళీ.. అమ్మకానికి లాడెన్ సోదరుడి భవనం

Update: 2021-08-02 17:30 GMT
ఉగ్రవాదంతో ప్రపంచాన్ని వణికించిన ఒసామా బిన్ లాడెన్ కథ ఎన్నడో సుఖాంతమైంది. ‘అల్ ఖైదా’ అనే ఉగ్ర సంస్థను స్థాపించి అమెరికాను ఎదురించి.. చివరకు అదే అమెరికా చేతిలో చచ్చాడు ఈ ఉగ్రవాది. అయితే అతడు, అతడి కుటుంబ సభ్యులు పోగేసిన ఆస్తులు మాత్రం అలాగే ఖాళీగా ఉన్నాయి.

అమెరికాలోని లాస్ ఏంజలెస్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒసామా బిన్ లాడెన్ సోదరుడు ఇబ్రహీం లాడెన్ కు విల్లా ఉంది. హోటల్ బెల్-ఎయిర్ కు సమీపంలో ఉండే ఈ విల్లా 20 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది.

2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై బిన్ లాడెన్ దాడి తర్వాత ఈ విల్లా ఖాళీ అయిపోయింది. లాడెన్ సోదరుడు పారిపోయి అజ్ఞాతంలో వెళ్లిపోయాడు.  అప్పటి నుంచి లాడెన్ వంశీయులెవరూ అక్కడ అడుగు పెట్టలేదు.

ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ విల్లాను అమ్మేయ్యాలని ఇబ్రహీమ్ నిర్ణయించుకున్నాడు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏడు బెడ్రూమ్ లు, ఐదు బాత్రూమ్ లతో ఉన్న ఈ బంగళాను 28 మిలియన్ డాలర్ల (దాదాపు 200 కోట్ల రూపాయలు)కు బేరం పెట్టాడు.

1931లో నిర్మితమైన ఆ బంగళాలను ఇబ్రహీమ్ 1983లో రెండు మిలియన్ డాలర్లకు కొన్నాడు. మాజీ భార్య క్రిస్టిన్ సినేతో కలిసి అక్కడే నివసించాడు. ఆ సమయంలో బిన్ లాడెన్, అతడి భార్య కూడా అక్కడే వారికి సహాయకులుగా ఉండేవారు. 2001 దాడి తర్వాత ఆ బంగళా ఖాళీ అయిపోయింది.
Tags:    

Similar News