మా పోటీ 'ఎంఐఎం'తోనే : మంత్రి కేటీఆర్ !

Update: 2020-11-24 12:10 GMT
గ్రేటర్ పోరు లో విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు కూడా తీవ్రంగా కష్టపడుతున్నాయి. పక్కా వ్యూహాలతో ప్రచారం కొనసాగిస్తూనే , మరోవైపు ఇతర పార్టీలపై , పార్టీ నేతలపై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పోరు తెరాస , బీజేపీ మద్యే ఉన్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ బరిలో నిలిచినా కూడా మునుపటిలా కాంగ్రెస్ అంత బలంగా లేదు. దీనితో బీజేపీ ఓటర్లను ఆకర్షించి జీహెచ్ ఎంసి మేయర్ పీఠం కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. గ్రేటర్ లో బీజేపీ విజయం కోసం కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ నేతలు తెరాస ప్రభుత్వం పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

బీజేపీ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్ ... హైదరాబాద్ కి మేము ఏం చేసామో చెప్పగలం అని , ఆరేళ్ళ కాలంలో హైదరాబాద్ ‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా , అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమపై బీజేపీ చార్జిషీట్లు విడుదల చేస్తోందని, పేకాట క్లబ్ ‌లు మూసివేయించినందుకు తమపై చార్జిషీట్లు విడుదల చేస్తుందా, అని ఆయన నిలదీశారు. బీజేపీ లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టిందని ఆయన ఆరోపించారు. వారంతా బీజేపీ పైనే చార్జిషీట్‌ వేయాలని అన్నారు. కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించడంతో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు చార్జిషీట్‌ వేయాలని,వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నారని ఆయన అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ దేశ భవిష్యత్‌ కోసమా, గుజరాత్‌ పెద్దల కోసమా, అని ఆయన ప్రశ్నించారు.  

హైదరాబాద్‌ లో గుంతల్లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష ఇస్తానని ఓ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారని ప్రస్తావించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా గుంతల్లేని రోడ్లను చూపిస్తే తానే రూ. 10 లక్షలు ఇస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు.  నీరు–తారు శత్రువులని, వర్షాలకు రోడ్లపై గుంతలు పడటం సహజం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా  ప్రశంసించి.. ఎన్నికల వేళ ఛార్జీషీట్‌ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్‌ రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే ఎం ఐ ఎం తో మాకు పొత్తు ఉందని విమర్శలు చేస్తున్నారని ,జీహెచ్ ఎంసి  ఎన్నికల్లో మా పోటీ ఎంఐఎం తో నే అన్నారు. మేయర్ గా టిఆర్ ఎస్ మహిళా అభ్యర్థే ప్రమాణ స్వీకారం చేస్తుంది అని అన్నారు.
Tags:    

Similar News