ప్రాంతీయ పార్టీలకో లక్షణం ఉంటుంది. అధినేత తర్వాతి స్థానం ఎవరికి ఉండదు. మహా అయితే.. ఆయన వారసుడికి మాత్రం ఎంతోకొంత అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటివి కూడా పరిమితంగా ఉంటుందే తప్పించి.. అపరిమితంగా ఉండనే ఉండదు. తమ హవా నడిచినంత కాలం పార్టీలో మరెవరికీ అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడరు. తమకు ప్రత్యామ్నాయంగా ఎదగటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వరు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఎవరైనా చేసినా.. వారిని ఎక్కడ.. ఎలా కట్ చేయాలో అధినేతలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. అమ్మగా సుపరిచితురాలైన జయలలితనే తీసుకోండి.. ఆమె బతికి ఉన్నప్పుడు.. ఆమె నెచ్చెలి శశికళ కాస్త తోక జాడించినట్లు అనిపించినంతనే ఆమెను దూరం పెట్టేశారు. ఆ తర్వాత దగ్గరకు తీయటం తెలిసిందే.
జయలలితను పక్కన పెడితే.. ఆత్మరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. ఎవరిని దగ్గరకు రానివ్వని అధినేతగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేరుంది. తన హయాం మొదలయ్యాక.. ఆయనకు సన్నిహితంగా ఉన్న సీనియర్ నేతలు చాలామందే ఉన్నారు. కానీ.. వారి సేవల్ని అవసరమైన మేరకు మాత్రమే వాడుకునే చంద్రబాబు తనకు ప్రత్యామ్నాయంగా.. లేదంటే పార్టీలో తన తర్వాతి వ్యక్తులుగా అస్సలు పరిగణించరు.
తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అయిన యనమల రామకృష్ణుడు.. కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలు తమను తాము ప్రొజెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు తర్వాత తమదేనన్న భావన కలిగించే ప్రయత్నం చేసినా.. అలాంటి భావన పార్టీలో పెరగకుండా చేయటంతో బాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాంటి చంద్రబాబులో ఈ మధ్యన మార్పుకొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. కొడుకు విషయంలోనే కాదు.. మరో మంత్రి విషయంలోనూ ఆయన తన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాబుకు షాడోగా నిర్ణయాల పరంగా ఆయన తనయుడు లోకేశ్ నిర్ణయాలు తీసుకోవటం.. కొన్ని ఇష్యూలలో ఆయన కలుగజేసుకోవటం లాంటి మాటలు ఈ మధ్యన తరచూ వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఇదంతా ఒకఎత్తు అయితే.. మున్సిపల్ మంత్రి వర్యులుగా వ్యవహరిస్తున్న నారాయణ.. పాలనా పరమైన వ్యవహారాల్లో జోక్యం రోజురోజుకీ పెరుగుతుందని చెబుతున్నారు. తన శాఖ పరిధిని దాటి.. కేఈ.. యనమల లాంటి వారి శాఖల్లోనూ వేలు పెడుతున్న వైనం పార్టీ వర్గాల్లో తరచూ చర్చకు రావటం గమనార్హం.
అమరావతి నిర్మాణ బాధ్యతల్ని అప్పగించిన నాటి నుంచి.. మిగిలిన శాఖల్లో వేలు పెట్టే ధోరణి నారాయణలో ఎక్కువైందని.. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. బాబు తర్వాత అనే మాటకు ఒకప్పుడు సమాధానం ఉండేది కాదని.. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా నారాయణ పేరు వినిపిస్తుండటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన శాఖ కానప్పటికీ.. వివిధ అంశాల పేరుతో.. పలువురు మంత్రుల శాఖల్లో ఆయన జోక్యం చేసుకుంటారని.. ఆయన అలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించే ధైర్యం మంత్రులు ఎవరూ చేయరని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఏమైనా బాబు తర్వాత ఎవరన్న ప్రశ్నకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సమాధానం దొరకటం కొత్త పరిణామంగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/