నారాయణ నోట మళ్లీ పాత పాటే
ఏపీ రాజధాని కోసం భూముల సేకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వైఖరిని విస్పష్టంగా వెళ్లడించిన తర్వాత కూడా ఏపీ మంత్రుల్లో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. భూసేకరణను నిలిపివేయాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇష్టం లేకుండా వారి నుంచి భూములు తీసుకోవద్దని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పటం తెలిసిందే. రాజధాని భూముల సేకరణ విషయంలో పవన్ తన వైఖరిని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మంత్రి నారాయణ మాత్రం పాత పాటనే పాడటం గమనార్హం.
ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల నుంచి.. వారిని ఒప్పించి ఇప్పించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని కోసం రైతుల్ని ఒప్పించి 33వేల ఎకరాల భూముల్ని సేకరించామని.. ఇంకా 2,200 ఎకరాలు మాత్రమే అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు భూములు ఇవ్వనందుకే భూసేకరణ ప్రకటన ఇచ్చామని చెప్పిన నారాయణ.. 2019 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే మిగిలిన భూమిని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే పరిస్థితులను అర్థం చేసుకొని పవన్ కల్యాణ్ రైతులను ఒప్పించి.. స్వచ్ఛందంగా భూమి ఇచ్చేలా కృషి చేయాలని ఆయన కోరారు.
ఎవరు ఎన్ని చెప్పినా.. తీరు మార్చుకోవటం వదిలేసి.. భూమిని సేకరించొద్దని వద్దన్న వ్యక్తినే.. అన్ని అర్థం చేసుకొని భూములు ఇప్పించాలని అడగటం మంత్రి నారాయణకే చెల్లింది. సహజంగా వ్యాపారవేత్త అయిన నారాయణకు.. ప్రజా సమస్యల్ని రాజకీయ నేతగా కంటే కూడా.. వ్యాపారవేత్తగా చూస్తున్నట్లు అనిపించట్లేదు..?