టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా తనకు తృప్తి లేదని, హుజురాబాద్ ఎమ్మెల్యే అయితేనే తృప్తి అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీగా ఉండి ఏ సమస్యను పరిష్కరించలేకపోతున్నానన్నారు. ఏం చేయాలన్నా, ఏ విషయంపై చర్చించాలన్నా ఎమ్మెల్యే అయితే బెటర్ అని ఆయన అన్నారు.
తాజాగా హుజూరాబాద్ టీఆర్ ఎస్ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు ఎమ్మెల్యేలుఅందరూ నియోజకవర్గాల బాటపడుతున్నారు.
ఈ క్రమంలో హుజూరాబాద్ నుంచి గత ఉప ఎన్నికలో పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఓడిపోయిన కౌశిక్ రెడ్డి కూడా తన నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
''మీరు ఏది అడిగితే అది ఇస్తున్న.. అయినా ఇంకా ఏదో చేయాలని ఉంది. అది చేయలేక పోతున్నా. హుజురాబాద్ ప్రజలు ఆలోచన చేయండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్న.
కేసీఆర్ నాకు టికెట్ ఇస్తారు. ఈ సారి నాకు ఓటేయండి. గెలిపించండి. నియోజకవర్గాన్ని హైదరాబాద్ మాదిరిగా తీర్చిదిద్దుతా. నన్ను నమ్మండి. కేసీఆర్ గారిని గెలిపించినట్టుగా భావించి నన్ను గెలిపించండి'' అంటూ కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. మరి ఆయన పిలుపు ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.