ఎవ‌రిని అడిగి భారత్ కు వెళ్లావ్‌?

Update: 2015-11-03 11:48 GMT
ఎన్నో ఆశ‌ల‌తో భార‌త్ కు వ‌చ్చి.. వివాదంతో త‌మ ప‌ర్య‌ట‌న‌ను ముగించి.. ఊసూరుమంటూ స్వ‌దేశానికి చేరిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్ర‌తినిధుల‌కు అనుకోని షాక్ త‌గిలింది. భార‌త్ తో టోర్నీ విష‌య‌మై మాట్లాడేందుకు వెళ్లి.. శివ‌సేన ఆందోళ‌న‌తో త‌మ చ‌ర్చ‌ల్ని మ‌ధ్య‌లో ముగించి స్వదేశానికి చేరుకోవ‌టం తెలిసిందే.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్ర‌తినిధులు ఆ మ‌ధ్య‌న ముంబ‌యి రావ‌టం.. భార‌త్‌ క్రికెట్ బోర్డు ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న స‌మ‌యంలో శివ‌సేన కార్య‌క‌ర్త‌లు పాకిస్థాన్‌ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేయ‌టం.. ఇలాంటి ప‌రిస్థితుల్లో చ‌ర్చ‌లు క‌ష్ట‌మ‌ని తేల్చి స‌మావేశాన్ని క్యాన్సిల్ చేయ‌టం తెలిసిందే.

అయితే.. పీసీబీ భార‌త్‌ ప‌ర్య‌ట‌న‌పై పాక్ స‌ర్కారు గుర్రుగా ఉంద‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అస‌లు భార‌త్ కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. అస‌లు భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకున్నారా? లేరా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.అస‌లు ఎవ‌రిని అడిగిన భార‌త్‌ కు వెళ్లారో చెప్పాలంటూ పాక్ ప్ర‌భుత్వం వివ‌ర‌ణ కోరింది.  దీనికి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. భార‌త్ క్రికెట్ బోర్డుతో చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మై.. ఇరు దేశాల మ‌ధ్య టోర్నీ జ‌రిగితే త‌మ ఆర్థిక ప‌రిస్థితి మొత్తంగా మారిపోతుంద‌ని క‌ల‌లు క‌న్న పీసీబీకి ఇప్పుడు స‌ర్కారు నుంచి నోటీసులు రావ‌టంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Tags:    

Similar News