పాక్ క్రికెటర్ల విషయంలో హాస్యాలు శృతిమించిపోతున్నాయి. అందులోనూ భారత్ తో మ్యాచ్ లో ఓటమి తర్వాత వారిపై గేలిచేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయిన పేరున్న పాకిస్థాన్ క్రికెటర్ ను ఓ యూజర్ ఈబేలో అమ్మకానికి పెట్టాడు. తనకు అతను ఇక ఏమాత్రం వద్దని - లేటెస్ట్ వెర్షన్ బౌలర్ తనకు దొరికాడని ఆ యూజర్ అమ్మకానికి గల కారణాన్ని చెప్పాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాతో మ్యాచ్ లో భారీగా పరుగులిచ్చి.. గాయం కారణంగా టోర్నీకే దూరమైన వహబ్ రియాజ్.
వహబ్ రియాజ్ ఫొటోతోపాటు ఈబేలో అమ్మకానికి పెట్టాడు. అయితే ఈబే వెంటనే ఆ బిడ్ ను తొలగించింది. అంతలోపే 50 బిడ్స్ రావడం విశేషం. ఓ యూజర్ అయితే.. 610 ఆస్ట్రేలియన్ డాలర్స్ చెల్లించి రియాజ్ ను కొంటానని బిడ్ వేశాడు. ఈబే తొలగించేలోపే కొందరు దీనిని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. వహబ్ పేపర్ వెయిట్ లాగా బాగా పనికొస్తాడని అమ్మకానికి పెట్టిన ఆ యూజర్ చెప్పాడు. వహబ్ ప్లేస్ లో జునైద్ ఖాన్ అనే అప్ గ్రేడెడ్ మోడల్ తనకు దొరికిందని అతను అన్నాడు. ఇండియాతో మ్యాచ్ లో 8.4 ఓవర్లు వేసిన వహబ్.. 87 రన్స్ ఇచ్చాడు. పూర్తి ఓవర్ల కోటా ముగియకుండానే.. గాయం కారణంగా తప్పుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ కు కూడా దిగని వహబ్.. టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/