ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతుంది. రాష్ట్రంలో ప్రతిరోజూ కూడా వేల సంఖ్యల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు , ప్రజాప్రతినిధుల నుండి విఐపిల వరకు ప్రతి ఒక్కరూ కరోనా భారిన పడుతున్నారు. అలాగే కరోనా ఫ్రంట్ లైన్ వారియన్స్ అయిన వైద్యులు, మెడికల్ స్టాఫ్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడ్డారు.
అలాగే , రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈవైరస్ బారినపడ్డారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. అక్కడే హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా సోకింది. దీంతో గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేసారు.
ఇదిలా ఉంటే నిన్న తిరుపతి ఎమ్మెల్యే భూమనకు రెండోసారి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన మరోసారి టెస్టుకు సిద్ధమయ్యారు. ఇకపొతే , ప్రభుత్వం బుధవారం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427కి చేరింది. ఇందులో 49,513 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,78,828 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 6,086కు చేరింది.