రాజకీయంగా తమిళనాట అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశాడంటే అందరిలోనూ ఆసక్తి కలగడం ఖాయం. ఐతే ఆయన రాజకీయ కారణాలతో ఈ లేఖ రాయలేదు. చెన్నై నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఈ లేఖ రాశారు.
చెన్నై నగరంలోని ప్రజలు తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే కృష్ణా జలాలను విడుదల చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి.. ఏపీ సీఎంకు శనివారం లేఖ రాశారు. వెంటనే కృష్ణా జలాలను విడుదల చెయ్యని పక్షంలో నీటి ఎద్దడి తీవ్రమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై నగర ప్రజలు తాగునీటికి ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడతారన్న సంగతి తెలిసిందే. చెన్నై నీటి అవసరాలు తీర్చడానికే ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రాజెక్టును కూడా ఆరంభించారు. అప్పట్నుంచి ఈ సుహృద్భావ చర్య కొనసాగుతూ ఉంది.
ప్రస్తుతం చెన్నై నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైందని.. ఉత్తర చెన్నైలో కలుషిత నీరు సరఫరా అవుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని.. నగరానికి తాగునీటిని అందించే జలాశయాల్లో నీటి మట్టం చాలావరకు తగ్గిపోతోందని.. ప్రతిపక్ష నాయుడు స్టాలిన్ ఆరోపిస్తూ.. చర్యల కోసం డిమాండ్ చేసిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం వెంటనే చంద్రబాబును సాయం అర్థించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/