ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఏపీ ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని సలహా ఒకటి ఇచ్చారు. అదికూడా జగన్ పై పెద్ద ఎత్తున్న వస్తున్న అక్రమంగా సంపాదించిన డబ్బులు విషయంలో కావడం, పైగా జగన్ చేస్తున్న డిమాండ్ కు మద్దతిచ్చినట్లు ఉండటం ఆసక్తికరం! ఇంతకీ సునీత ఇచ్చిన సలహా దేని గురించి అంటే రుణమాఫీ.
కాణిపాకం ఆలయం దర్శనం సందర్భంగా పరిటాల సునిత విలేకరులతో మాట్లాడారు. వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడంలేదంటూ తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ సునీత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రుణమాఫీ చేస్తోందని ఆమె చెప్పారు. తండ్రి అధికారంలో ఉండగా జగన్ వేలకోట్లు సంపాదించారని, ఆ అక్రమ సొమ్మును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చినట్లైతే రాష్ట్రంలో ఒకేసారి రైతు రుణమాఫీ అమలు చేస్తామని సునీత అన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలు జరుగుతుండటంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిస్తోందన్నారు. ఇప్పటివరకు 11వేల కోట్లు రూపాయలను రుణమాఫీ కింద పంపిణీ చేశామన్నారు.
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సర్వే జరుగుతోందని, సర్వే నివేదిక ఆధారంగా ఒక్కో జిల్లాలో ఎన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సునీత అన్నారు. పేదముస్లిం మైనార్టీలు సంతోషంగా రంజాన్ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న రంజాన్ తోఫాను అందజేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11 లక్షల మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నామని సునీత తెలిపారు. చౌక దుకాణాల్లో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి కింద టమోటా పచ్చళ్లు తయారు చేసి స్థానికంగా విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు.