పవ‌న్ క్లారిటీ..ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీ

Update: 2017-04-22 08:05 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న భవిష్యత్ కార్యాచరణపై మరింత క్లారిటీ ఇచ్చారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న‌కు అంతే ధీటుగా స్పందించారు. తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ  ‘సార్వత్రిక ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. ఆరు నెలలకు ముందే ఎన్నికలు రావచ్చని నాకున్న సమాచారం. కాబట్టి అందరూ ఎన్నికల మూడ్‌ లోకి వెళ్లి పార్టీని గెలిపించడంపై దృష్టి పెట్టండి` అని అన్నారు. ఏపీ సీఎం కామెంట్ల‌పై పవ‌న్ స్పందించారు. ఈ మేర‌కు ట్వీట్ చేస్తూ ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా  వస్తే.., జన"సేన" సిద్దమే అని తాజాగా ట్వీట్ చేశారు.

2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతుందని పవన్ గ‌తంలోనే ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవ‌లే జ‌న‌సేన కార్య‌కర్త‌ల కోసం ప్ర‌త్యేకంగా ఎంపిక ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. మొద‌ట‌గా అనంత‌పురం జిల్లా నుంచి త‌న కార్య‌క‌ర్త‌ల‌ను ఎంపిక చేసుకుంటామ‌ని తెలిపిన జ‌న‌సేనాని ఆ త‌దుప‌రి మిగ‌తా జిల్లాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇలా పార్టీ క్యాడ‌ర్‌ ను ఇంకా పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధం చేసే ద‌శ‌లోనే జ‌న‌సేన ఉంది. మ‌రోవైపు ఎన్నికలు వచ్చేందుకు దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంది. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు ముందుస్తు ఎన్నికలు వస్తే పోరాటానికి జనసేన సిద్ధంగా ఉందన్న పవన్‌ మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News