పవన్ కల్యాణ్ బయలుదేరారు. ఏపీ రాజధాని ప్రాంతాల్ని తాను సందర్శిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. శనివారం సాయంత్రం తన పర్యటన గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. ఆదివారం తాను ఏపీ రాజధాని ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పినట్లే.. ఉదయం ఏడు గంటలకే పవన్ ఇంటి నుంచి బయలుదేరారు.
అందరూ అనుకున్నట్లు.. గన్నవరం వరకూ ఫ్లైట్ లో వెళ్లి.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వెళతారనుకున్న దానికి భిన్నంగా ఆయన రోడ్డు మార్గంలోనే వెళుతున్నారు. ఏపీ రాజధానిలోని రైతుల భూముల సేకరణకు సంబంధించి ఏపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై ఆయా ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తున్నారు. తొలుత పెనుమాక గ్రామంలో పర్యటిస్తారని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ రాక కోసం పలు ప్రాంతాల్లోని రైతులు ఎదురుచూస్తున్నారు. మరి.. పవన్ తన తాజా పర్యటనలో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.