బీజేపీ వ‌ద్ద ప‌వ‌న్ ప‌ర‌ప‌తి ఎంతో కూడా తేలుతుందా!

Update: 2020-01-28 05:39 GMT
మండ‌లి ర‌ద్దును ఖండించారు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్. వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొంద‌లేద‌ని మండ‌లిని ర‌ద్దు చేయ‌డం సమంజ‌సం కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మండ‌లి ఎంతో ఉన్న‌త భావాల‌తో ఏర్ప‌డింద‌ని అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు. మండ‌లి ర‌ద్దు ను ఖండించే ట‌ర్న్ తీసుకున్నారు కాబ‌ట్టి.. ప‌వ‌న్ మండ‌లి ఔన్న‌త్యాన్ని చెప్పుకొచ్చారు. మ‌రి ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్ మండ‌లి రద్దు కు త‌ను వ్య‌తిరేకం అని స్ఫ‌ష్ట‌త ఇచ్చారు.

మ‌రి ఇదే స‌మ‌యం లో క‌మ‌లం పార్టీ వ‌ద్ద త‌న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించుకుని జ‌న‌సేన అధినేత మండ‌లి ర‌ద్దును కేంద్రంలో అడ్డుకుంటారా? అనేది ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న‌ గా మారింది. మొన్న‌టి వ‌ర‌కూ ఏ విష‌యం లో అయినా.. కేంద్రానికి చెబుతా, ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటా, మోడీ కి కంప్లైంట్ ఇస్తా.. అన్న‌ట్టుగా మాట్లాడారు ప‌వ‌న్ క‌ల్యాణ్. మూడు రాజ‌ధానుల అంశం మీద కూడా అలాగే వ్య‌వ‌హ‌రించారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేసి వ‌చ్చారు. అయితే ఢిల్లీలో మాత్రం ప‌వ‌న్ దూకుడు క‌నిపించ‌లేదు. మూడు రాజ‌ధానుల అంశానికీ కేంద్రానికీ సంబంధం లేద‌ని అంటూ.. జ‌న‌సేన అధిప‌తి అంత‌కు ముందు మాట్లాడిన‌ దానితో విబేధిస్తున్న‌ట్టుగా మాట్లాడారు. బీజేపీ తో చేతులు క‌లిపిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు కొంత అవ‌కాశం త‌గ్గింది. ఇలాంటి నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తార‌నేది ఆస‌క్తి దాయ‌కంగా మారింది.

మండ‌లి ర‌ద్దుకు ఏపీ ప్ర‌భుత్వం త‌ను చేయాల్సిందంతా చేసింది. ఇక జ‌ర‌గాల్సిందంతా ఢిల్లీ లో జ‌ర‌గాల్సిందే. ఢిల్లీ పార్టీ తో ప‌వ‌న్ ఇప్పుడు చేతులు క‌లిపారు. ఈ నేప‌థ్యం లో ఈయ‌న మండ‌లి ర‌ద్దును పార్ల‌మెంట్ వ‌ద్ద అడ్డుకొమ్మ‌ని బీజేపీకి చెబుతారా? జ‌గ‌న్ ఏ నిర్ణ‌యాన్ని తీసుకున్నా వ్య‌తిరేకించేందుకు ముందుండే ప‌వ‌న్ క‌ల్యాణ్..ఢిల్లీలో ఏమైనా చ‌క్రం తిప్ప‌గ‌ల‌రా? క‌మ‌లం పార్టీ వ‌ద్ద ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర‌ప‌తి ఎంత‌.. అనేది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కంగా మారింది. అదెంతో ఇప్పుడు తేలిపోతుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.


Tags:    

Similar News