పేరుకు ముందు పెట్టుకున్న పవర్ కు తగ్గట్లు.. మాటల్లోనూ.. చేతల్లోనూ ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్ మరోలా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఏదో జరుగుతుందన్న భావన కలిగించటంలో సక్సెస్ అయిన పవన్.. దాన్ని రియాలిటీలోకి తీసుకురావటంలో ఎంతలా ఫెయిల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టైంలో ఎలాంటి మాటలు మాట్లాడాలన్న అంశంపై ఆయనే కాదు.. ఆయన వెనుకున్న టీం సైతం సరైన కసరత్తు చేయటం లేదన్న మాట వినిపిస్తోంది.
దీనికి బలం చేకూరేలా తాజాగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. మాయదారి రోగంతో సహజీవనం తప్పించి మరో మార్గం లేదని.. వ్యాక్సిన్ కనుగొనేవరకూ దాంతో జర్నీ చేయక తప్పదన్న మాట ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రావటం తెలిసిందే. ఈ మాటను ఎవరెంతలా వాడుకున్నారో.. జగన్ ను మాటలతో ఎంతలా ఆడుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
మాయదారి రోగంపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టిన వారంతా తర్వాతి కాలంలో నాలుక్కర్చుకోవటమే కాదు.. అత్యుత్సాహంతో సెల్ప్ గోల్ కొట్టుకున్నట్లైందన్న వేదనకు గురి కావటం తెలిసిందే. భవిష్యత్తును సరిగా గుర్తించటంలో జగన్ సక్సెస్ అయితే.. ఆయన మాటలతో పొలిటికల్ మైలేజీ పొందాలనుకున్న వారికి ఎదురుదెబ్బలు తప్పలేదు.
మాయదారిరోగంతో సహజీవనం తప్పించి ఇప్పటికైతే మరో మార్గం లేదన్న విషయాన్ని తోపుల్లాంటి ప్రముఖుల నోటి నుంచి రావటంతో జగన్ మీద అదే పనిగా విరుచుకుపడిన వారంతా మౌనం దాల్చాల్సి వచ్చింది. అంతలా ఇబ్బంది పెట్టిన సహజీవనం మాటతో మరోసారి పంచ్ వేసే ప్రయత్నం చేశారు జనసేనాధినేత పవన్. విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ నుంచి లీకైన విష వాయువు ఎపిసోడ్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఫల్యాల్ని ప్రశ్నించే క్రమంలో పవన్ ఉపయోగించిన సహజీవనం మాట అనవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎల్ జీ పాలిమర్స్ కారణంగా స్టైరీన్ పుణ్యమా అని పలువురు మరణించటం.. దాని కారణంగా రెండువందలకు పైగా ప్రజలు అస్వస్థతకు గురి కావటం తెలిసిందే. ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయిలు.. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి నష్టపరిహారం ఇచ్చిన ప్రభుత్వం.. పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాంటి పరిష్కారం చూపుతారని ప్రశ్నించారు. ఇంతవరకూ ఓకే కానీ.. మాయదారి రోగంతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న జగన్ సర్కారు.. స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయాల్సిందేనా? అంటూ ఎద్దేవా చేశారు.
మాయదారి రోగంతో ఇబ్బంది పడుతోంది ఏపీ మాత్రమే కాదు. ప్రపంచమే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వ్యాక్సిన్ వచ్చే వరకూ దాంతో సహజీవనం తప్పదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు ప్రధాని మోడీ వరకూ.. అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్న వేళ.. సహజీవనం మాటను ఉపయోగించటం ద్వారా పవన్ తన అవగాహన లేమిని ప్రదర్శించుకున్నట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని అంశాల్ని అదే పనిగా ప్రస్తావించటం ఎంత ముఖ్యమో.. మరి కొన్నింటిని ప్రస్తావించకుండా వదిలేయటం చాలా అవసరం. వేటికెలా రియాక్టు కావాలో పవన్ కు సరే.. ఆయనకు వ్యూహాలు రచించే వారికి సైతం అవగాహన లేకపోవటం ఏమిటి?