‌బీమా ఉన్నా డ‌బ్బులు ఇవ్వాల్సిందేనంటున్న ప్రైవేటు ఆస్ప‌త్రులు!

Update: 2020-07-20 11:30 GMT
అనారోగ్యం చెందితే రాయితీతో లేదా పూర్తి ఉచితంగా వైద్యం పొందేందుకు ర‌క‌ర‌కాల సౌక‌ర్యాలు ఉన్నాయి. బీమా.. హెల్త్ కార్డు త‌దిత‌ర ఉన్నాయి. కానీ ప్ర‌స్తుతం అవేవి వ‌ర్తించ‌డం లేదు. బీమా.. హెల్త్ కార్డు ఉంది క‌దా అని ఆస్ప‌త్రుల‌కు వెళ్లితే వారికి చుక్కెదుర‌వుతోంది. ప్ర‌స్తుతం వాటిని వ‌ర్తించ‌డం లేద‌ని ప్రైవేటు ఆస్ప‌త్రులు చెబుతున్నారు. బీమా.. హెల్త్ కార్డు ఇత‌ర ఏ కార్డులు ఉన్నా ఇప్పుడు వ‌ర్తించ‌వు.. ఏవీ ఉన్నా డ‌బ్బులు చెల్లించాల్సిందేన‌ని ఆస్ప‌త్రులు కోరుతున్నాయి. ప్ర‌స్తుతం ఏ ఆస్ప‌త్రుల్లో వారికి బెడ్‌ దొరకలేదు. డ‌బ్బులిస్తేనే వారికి బెడ్లు ఇస్తున్నారు. అలాంటి ప‌రిస్థితి ప్ర‌జ‌ల‌కు ఎదురైంది‌. ఈ సంద‌ర్భంగా కార్పొరేట్ ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

బెడ్‌ కావాలంటే.. క్యాష్‌ చెల్లించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. కార్డు పేమెంట్లు, చెక్కులు కూడా తీసుకోం.. న‌గ‌దు చెల్లించాల‌ని కోరుతున్నాయి. ఈ విధంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు బీమా పాలసీలను వ‌ర్తించ‌డం లేదు. బెడ్‌ కావాలంటే.. బీమా పాలసీలను మరచిపోయి, డబ్బు తెచ్చుకోవాలని సూచిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో తలనొప్పి దండుకుంటున్నాయి. ప‌న్నులు త‌ప్పించుకునేందుకు కొన్ని ఆస్ప‌త్రులు వింత వాద‌న‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో బిల్లుల మాయకు తెరలేపాయి. బిల్లు కావాలంటే ఒక రేటు.. రశీదు వద్దనుకుంటే తగ్గింపు ధర ఉంటుందని ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఏది ఉన్నా డబ్బును నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది అని ప్రైవేటు ఆస్ప‌త్రులు చెబుతున్నాయి. దీంతో రోగులు ఇదేమిట‌ని వారిని ప్ర‌శ్నిస్తున్నారు. అన్నీ ఉన్నా ఎందుకు న‌గ‌దు చెల్లించాల‌ని వాగ్వాదం ప‌డుతున్నారు.

కొన్ని వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్నా వైర‌స్ లేదు. కానీ అలాంటి ల‌క్ష‌ణాల‌తో వ‌చ్చిన వారికి ఆస్పత్రులు చుక్క‌లు చూపిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రిలోకి రాగానే వారి స‌మ‌స్య ప‌రిశీలించి ఎంత ఖర్చు అవుతుందో ముందే కేటలాగ్‌లను వారికి అందిస్తున్నారు. ఇంత‌వుతుంది అని చెప్పి అనంత‌రం వారిని చేరుతారా అని అడుగుతున్నారు. మిగ‌తా సాధార‌ణ రోగులైతే వెన‌క్కి వెళ్తున్నారు. కానీ ఆయాసంతో బాధ ప‌డుతున్న వారు ఇప్పుడున్న పరిస్థితిలో ఐసోలేషన్‌ ఐసీయూ బెడ్.. ఆక్సిజన్‌.. వెంటిలేటర్ కూడా అవ‌స‌రం. దీంతో వాట‌న్నింటికి భారీగా బిల్లు అవుతుందని చెబుతున్నాయి. ఇక విధిలేక ఆ రోగులు ఆస్ప‌త్రుల్లో న‌గ‌దు చెల్లించి చేరాల్సి వ‌స్తోంది. దీనికి ఆస్ప‌త్రుల్లో ఈ విధంగా చార్జీలు చేస్తు్న్నారు.

రోగి ఆరోగ్యం బ‌ట్టి రోజుకు రూ.30-40 వేల వరకు, ఐసీయూ అయితే రూ.50-70 వేలు, వెంటిలేటర్‌ అయితే రోజుకు కనీసం రూ.లక్ష అవుతాయని స్ప‌ష్టంగా చెబుతున్నారు. డబ్బు ఉంటే రోగిని ఆస్పత్రిలో చేర్చండి లేకపోతే లేదని ముందే చెప్పేస్తున్నారు. ఈ విధంగా ప్రైవేటు ఆస్ప‌త్రుల వ్య‌వ‌హారం ఉంది.

బీమా తీసుకున్న వారిని ఆయా కంపెనీల పరిధిలో ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులు తిరస్కరించకూడదు. అలా తిర‌స్క‌రిస్తే వైద్యాన్ని నిరాకరించడమే అవుతుంది. కానీ దీనిని ఆస్ప‌త్రులు పాటించ‌డం లేదు. బీమా  క్లెయిమ్‌కు ఆల‌స్య‌మ‌వుతుండ‌డంతో ముందే న‌ష్టాల్లో ఉండ‌డంతో ఆస్పత్రులు న‌గ‌దు చెల్లించాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో బీమా పాల‌సీల‌ను అంగీక‌రించ‌డం లేదు. మొద‌ట మ‌హ‌మ్మారి వైర‌స్ బాధితుల చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు బీమాకు అనుమ‌తి ఇచ్చాయి. అయితే బీమా కంపెనీల ఆడిట్‌తో తమ ర‌హాస్యాలు తెలుస్తాయ‌నే భయంతో ఇప్పుడు చాలా కంపెనీలు బీమా‌ను తిరస్కరిస్తున్నాయి. అంగీక‌రించ‌డం లేదు. ఈ విధంగా ప్రైవేటు.. కార్పొరేట్‌ ఆస్పత్రుల ప‌రిస్థితి. ముందే గ‌డ్డు కాలం ఈ స‌మ‌యంలో బీమా అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో పేద‌.. మ‌ధ్య త‌ర‌గ‌‌తి ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Tags:    

Similar News