పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళలో పని చేయటం అంత తేలిక కాదు. సాదాసీదా ఉద్యోగాలు చేసే వారే.. తమకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను డీల్ చేసేందుకు చెప్పే మాటలు చాలానే వింటుంటాం. అలాంటిది కేంద్ర మంత్రి స్థానంలో ఉండి.. తన ప్రమేయం లేకుండా జరిగిన ఘోర దుర్ఘటనతో దేశ ప్రజలందరి చేత వేలెత్తి చూపిస్తున్నా.. మౌనంగా భరిస్తూ.. జరగాల్సిన పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి..పోయిన పేరు ప్రఖ్యాతుల్ని గంటల వ్యవధిలో తిరిగి తెచ్చుకున్న వైనం చూస్తే.. వావ్ అనాల్సిందే.
తన చేతలతో ఆయనో కొత్త విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేశారు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న వేళలో.. వాటికి స్పందించే కన్నా.. మౌనంగా పని చేసుకుంటూ పోవటం ద్వారా పోయిన పేరు ప్రఖ్యాతుల్ని ఎలా వెనక్కి తెచ్చుకోవచ్చన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు. ఏదైనా ఘోరం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయటం చాలా కాలంగా చూస్తున్నదే.
నిజానికి.. రాజీనామా చేయటమే అత్యుత్తమ పరిష్కారమా? దారుణ పరిస్థితులు నెలకొన్న వేళలో.. దాన్ని క్లియర్ చేయటం ముఖ్యమా? నేను విలువల్ని పాటిస్తానంటూ రాజీనామా చేసి జరగాల్సిన పనుల కంటే కూడా తనను తాను గొప్పగా చిత్రీకరించుకోవటం సరైన చర్యా? అన్నది ప్రశ్న. నిజానికి కష్టంలో ఉన్న వేళలో కాడిని పక్కకు పడేసి.. రాజీనామా ఆదర్శాల్ని ప్రదర్శించే కన్నా.. కష్టాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చేయటం.. సాంత్వన చేకూరేలా చేయటం చాలా అవసరం.
అలాంటి తీరునే ప్రదర్శించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకున్న వేళ.. ఆయన్ను అందరూ ఆడిపోసుకున్న వాళ్లే. గతంతో పోలుస్తూ..రాజీనామా చేయలేదు చూడు అంటూ విమర్శించినోళ్లే. అయితే.. ఆ మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పని చేసే వందలాది కార్మికుల్లో ఒకడిగా మారిన ఆయన.. యుద్ధ ప్రాతిపదికన పనుల్ని పూర్తి అయ్యేలా చేసి కొత్త ఆదర్శనానికి చిరునామాగా మారారు.
రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వైష్ణవ్.. సివిల్స్ టాపర్ గా నిలిచి ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిగా కొనసాగారు. కేంద్రంలోనూ కీలక పదవుల్ని చేపట్టారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాయంతో బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. మోడీ సర్కారులో రైల్వే మంత్రిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఒడిశా ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో శనివారం ఉదయం వచ్చిన ఆయన.. ఆదివారం సాయంత్రానికి ట్రాక్ పనులు పూర్తి కావటం.. సహాయక చర్యలు ఒక కొలిక్కి వచ్చే వరకు.. ఘటనా స్థలంలోనే ఉండి.. స్వయంగా పర్యవేక్షించారు.
తాను కేంద్రమంత్రి అన్న విషయాన్ని వదిలేసి.. బాధితులకు సాయం అందే అంశంపైనే ఫోకస్ చేశారు. ఘటనస్థలానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు రావటం.. వారందరికి.. జరిగిన ఘోరాన్ని వివరించారు. తన ఎదుటే తనను బెంగాల్ సీఎం విమర్శిస్తున్నా.. నిగ్రహాన్ని పాటించారే కానీ.. రాజకీయ వ్యాఖ్యలు చేసి ఇష్యూను వేరే మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు.
బాలేశ్వర్.. భద్రక్ ఆసుపత్రులకు వెళ్లి గాయపడిన వారికి ధైర్యం చెప్పటంతో పాటు.. వారికి అండగా నిలిచారు. వారి అవసరాల్ని తీర్చటంతో పాటు.. ప్రమాదం జరిగిన 51 గంటల్లో రైళ్లు మళ్లీ పట్టాల మీదకు పరుగులు తీసే వరకు అక్కడే ఉండి.. అధికారులకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. దెబ్బ తిన్న బోగీల తొలగింపు.. ట్రాక్ ల పునరుద్దరణ.. చిన్నాభిన్నమైన ఎలక్ట్రిక్ సిగ్నల్ వ్యవస్థల్ని పునరుద్దరించే వరకు దగ్గరుండి పర్యవేక్షించిన ఆయనకు తోడుగా నిలిచారు కేంద్ర రైల్వే సహాయమంత్రి ధర్మేంద్ర.
మొత్తంగా చూస్తే.. ఘోర ప్రమాదంతో ఎదురైన డ్యామేజ్ ను పట్టించుకోకుండా జరగాల్సిన పనులను వాయు వేగంగా పూర్తి చేయటం.. బాధితులకు సాయం చేస్తూ అండగా నిలిచారు. పనుల మీద ఫోకస్ చేసి.. గంటల వ్యవధిలోనే పోయిన పేరును తిరిగి తెచ్చుకున్నారు. సవాళ్లు ఎదురైప్పుడు ఎలా స్పందించాలన్న దానికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సరికొత్త ఉదాహరణగా మారారు.