ఏ చిన్నపాటి వర్షం పడ్డా.. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు జలమయం కావడం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు చిత్రంగా ఏ చిన్నపాటి వర్షం పడ్డా.. రైల్లో.. అదికూడా డ్రైవర్ కేబిన్ నీటితో తడిసిపోతోంది. దీంతో ఆ డ్రైవర్ గొడుగును పట్టుకునే రైలును నడుపుతున్నాడు. చిత్రంగా అనిపించినా ఇది నిజం! ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేసిన వీడియో అదే.. లక్షల కోట్ల వ్యాపారం చేసే రైల్వే శాఖ ఈ రైలు దుస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదని, గత కొన్నేళ్లుగా ఈ రైలు కేబిన్ పరిస్థితి ఇలానే ఉందని డ్రైవర్ వాపోతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి డ్రైవర్ పడుతున్న కష్టాలను కళ్లకు కడుతూ ఓ మహిళ దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అందరి దృష్టీ పడింది.
జార్ఖండ్ లోని ధన్ బాద్ రైల్వేలో ఓ లోకల్ ట్రైన్ పైన అన్నీ చిల్లులేనట! దీంతో చిన్నపాటి వర్షానికే వర్షపు నీళ్లు.. డ్రైవర్ కూర్చునే కేబిన్ ను ముంచెత్తు తున్నాయట. ఈ సమస్య ఎన్నో ఏళ్లుగా ఉందని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని అంటున్నారు డ్రైవర్ గారు. ప్రస్తుతం ఆయన పని రైలును నడపడంతోపాటు.. కంట్రోల్ ప్యానల్ తడిచి పోకుండా గొడుగు పట్టుకోవడం కూడా! గొడుగు పట్టుకుంటున్నది తన కోసం కాదని, రైలును నియంత్రించే కంట్రోల్ పానెల్ తడవడకుండా ఉండటం కోసమని ఆయన చెబుతున్నారు.
ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి వస్తుంటుందని వివరించాడు. దీని గురించి ఫిర్యాదు చేసినా పై అధికారులు పట్టించుకోకపోవడంతో గొడుగు సహాయంతో నెట్టుకొస్తున్నానని ఆయన వివరించారు. ఈయన పరిస్థితిని వీడియో తీసి ఓ మహిళ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ రైల్వే మంత్రి సురేశ్ ప్రభును ట్యాగ్ చేసింది. ట్వీట్లపై ఇటీవల కాలంలో వెనువెంటనే స్పందిస్తున్న మంత్రి సురేశ్ ప్రభు.. దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే మేలని అంటున్నాడు డ్రైవర్.
Full View