బడ్జెట్ ప్రసంగం అంటే సీరియస్ గా సాగుతుంటుంది. తక్కువ సందర్భాల్లో ప్రతిపక్షాలకు పంచ్ లు వేసే ప్రయత్నం చేస్తుంటారు ఆర్థికమంత్రి. కవితలు.. కొటేషన్లు చెబుతూ తమ బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒక సినిమా ప్రస్తావన రావటం చాలా అరుదు. మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన చివరి బడ్జెట్ ప్రసంగం వేళ.. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ ప్రస్తావన వచ్చింది.
తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. సినిమా రంగానికి సంబంధించిన పథకం గురించి ప్రస్తావించే సమయంలో ఊరీ.. ది సర్జికల్ స్ట్రైక్స్ మూవీ బాగుందంటూ ప్రశంసించారు. పీయూష్ పక్కనే కూర్చున్న బీజేపీ కురువృద్ధుడు అద్వానీ సైతం బాగుందంటూ తన రియాక్షన్ ను తెలియజేశారు.
తనకు ఊరీ సినిమా చూసే ఛాన్స్ వచ్చిందని.. ఆ సినిమాలో చాలా జోష్ ఉందన్న ఆయన.. పీవోకేలోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ మీద భారత్ నిర్వహించిన మెరుపుదాడుల ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. బడ్జెట్ ప్రసంగంలో ఊరీ మూవీ ప్రస్తావన రావటంతో బీజేపీ సభ్యులు ఆనందంతో బల్లలు చరిచారు. వారి ఉద్దేశంలో సినిమా కంటే.. ఆ సినిమాకు కారణమైన సర్జికల్ స్ట్రైక్స్ ను తమ ప్రభుత్వమే చేపట్టిందన్న ఆనందాన్ని తమదైన శైలిలో వ్యక్తం చేశారు.
ఊరీ మూవీని ప్రధాని మోడీ మొదలు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ తో సహా పలువురు బీజేపీ నేతలు ఈ సినిమాను చూశారు. ఇక.. లాల్ కృష్ణ అద్వానీ అయితే.. తన కుమార్తె ప్రతిభతో కలిసి ఈ సినిమాను చూశారు. 2016లో పఠాన్ కోటలోని సైనిక శిబిరం మీద జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు మెరుపుదాడులు నిర్వహించటం.. ఇదో సంచలనంగా మారితే.. ప్రపంచంలోని ఏ దేశం సర్జికల్ స్ట్రైక్స్ ను తప్పుపడుతూ ప్రకటన విడుదల చేయకపోవటం మరో విజయంగా చెప్పక తప్పదు.