వాట్ ఏ కామెడీ మోడీజీ!

Update: 2022-11-12 12:32 GMT
'తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి' అని ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి బేగంపేటలో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి అన్యాయం చేస్తోంది బీజేపీనే.. విభజన హామీల నుంచి నిధులు, విధుల కేటాయింపుల్లో పూర్తిగా తెలుగు రాష్ట్రాలను నట్టేట ముంచుతోంది మోడీ సర్కార్.. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే కోచ్ లాంటి ఏవీ ఇవ్వకుండా ఏపీ నోట్లో మట్టికొట్టింది మోడీ సర్కార్.

ఇక తెలంగాణలో బయ్యారం ఉక్కు.. హైదరాబాద్ చుట్టూరా ఐటీ హబ్, ఖాజీపేట్ రైల్వే కోచ్ ను గుజరాత్ కు తరలించి మోడీ సర్కార్ ఎంత అన్యాయం చేయాలో అంత చేసేసింది. అలాంటి మోడీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఈరోజు ఇచ్చేశారు. నిజానికి అన్యాయం చేసేది తనే అన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడారని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. 'వాట్ ఏ కామెడీ' మోడీ జీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

తెలంగాణలో మోడీ పర్యటనకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో విస్తరించిన చేనేతన్నల పొట్టకొట్టేలా.. కార్పొరేట్లకు దోచిపెట్టేలా వస్త్రాలపై 5శాతం జీఎస్టీని విధించిన ఘనత మోడీదే. మొన్న హైదరాబాద్ సమావేశాలు, నేడు మోడీ వస్తే నల్లటి ఫ్లెక్సీలతో తెలంగాణ చేనేత యూత్ అంటూ పోస్టర్లు అంటించారు. 'నో ఎంట్రీ టు తెలంగాణ మోడీజీ' అంటూ గో బ్యాక్ నినాదాలు చేశారు.

ఇక్కడే కాదు తెలంగాణలోని సింగరేణిలోనూ అదే పరిస్థితి. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సింగరేణి కార్మికులు, కమ్యూనిస్ట్ కార్మిక సంఘాలన్నీ నిరసన తెలిపాయి. మోడీ తెలంగాణకు చేసిన అన్యాయం.. బాధితులందరూ ఆయన్ను వ్యతిరకిస్తున్నారు.  మోడీ కార్పొరేట్ పాలనను తూర్పారపడుతున్నారు.

ప్రధాన ఆవాస యోజన కింద ఇంటికి లక్షన్నరే ఇస్తారు. అదే కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉచితంగా కట్టిస్తారు. తెలంగాణలో నా పథకం అమలు చేయడం లేదు ఎందుకని మోడీ ప్రశ్నించారు. మోడీ సర్కార్ ఇచ్చే లక్షన్నర ఇల్లు కాదు కదా.. కనీసం పునాది కూడా పూర్తి కాదు. అలాంటి పెద్ద మనిషి తన పథకాలపై గొప్పలు చెప్పుకోవడమే వింత.. తెలంగాణకు వచ్చి ఇక్కడి పథకాల కంటే తన పథకాలు గొప్ప అని మోడీ చేసిన కామెంట్స్ నవ్వుల పాలయ్యాయి. కేంద్ర పథకాల కంటే తెలంగాణ పథకాలే బెస్ట్ అన్నది మోడీ మరిచిపోయారు. అందుకే మోడీ కామెంట్స్ బూమరాంగ్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకుండా ముంచిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫేక్ హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను వంచిచడానికి తయారైంది.కానీ ఇక్కడ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News